- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ పై భారత్ ఆంక్షలు
పహెల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తరత్వ భారత్-పాకిస్థాన్ (India-Pakistan)ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇలాంటి సమయంలో పాక్ ను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తరత్వ భారత్-పాకిస్థాన్ (India-Pakistan)ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇలాంటి సమయంలో పాక్ ను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న పాక్ కు ఎగుమతి చేసే ఔషధాలు, ఫార్మా, ఉత్పత్తుల వివరాలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ సేకరిస్తోంది. ఆ వివరాలను అత్యవసరంగా పంపాలని ఫార్మా ఎక్స్‌పోర్ట్ బాడీ ఫార్మెక్సిల్‌ను కోరింది. ‘‘మేం పాక్ కు ఎగుమతి చేస్తున్న ఫార్మా ఉత్పత్తుల డేటాను కోరాం. ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఫార్మెక్సిల్) ఆ దిశగా పనిచేస్తోంది. త్వరలో వివరాలు పంపనుంది’’ అని ఓ సీనియర్ అధికారి మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. భారత ఫార్మా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న 219 దేశాల్లో పాక్ 38వ స్థానంలో ఉంది. అయితే, ఈ వాణిజ్య సంబంధాలను భారత్ తెంచుకోవడం ద్వారా పాక్‌పై తీవ్ర ప్రభావం పడనున్నట్లు మరో అధికారి అంచనా వేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడం ఇదే తొలిసారి కాదు. బాలాకోట్ వైమానిక దాడులు, ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా ఈ పరిస్థితులు కనిపించాయి.
ఎలక్ట్రానికి వస్తువులపైనా..
మరోవైపు, పాకిస్థాన్‌కు ఎలక్ట్రానిక్స్, ఈ-కామర్స్ వస్తువుల ఎగుమతిని పరిమితం చేయాలని భారత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆంక్షలు విధించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. భారత్-పాక్ మధ్య వాణిజ్యం నేరుగా లేదు. కానీ, యూఏఈ, శ్రీలంక, సింగపూర్ వంటి దేశాల నుంచి భారత్ వస్తువులు పాక్‌కు చేరుతుంటాయి. వాటిలో బంగారం, విలువైన రంగురాళ్లు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్, ఈ కామర్స్ ఉత్పత్తులు ఉన్నాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ డేటా ప్రకారం.. ఈ థర్డ్ కంట్రీస్ ద్వారా పది బిలియన్ డాలర్లకుపైగా విలువైన భారత వస్తువులు దాయాదికి ఎగుమతి అవుతున్నాయి. అయితే, వాటిపైనా భారత్ ఆంక్షలు విధిస్తే.. పాక్ పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారనుంది.






