- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Russia: భారత్ కు మరికొన్ని ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్స్
భారత్ మరికొన్ని ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ యూనిట్స్ ని రష్యా నుంచి దిగుమతి చేసుకోనుంది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ మరికొన్ని ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ యూనిట్స్ ని రష్యా నుంచి దిగుమతి చేసుకోనుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ డ్రోన్లు, మిసైల్స్‌తో దాడికి ప్రయత్నించగా ఎస్-400 సహాయంతో వాటిని భారత్ విజయవంతంగా కూల్చివేసింది. అందుకే, అదనపు యూనిట్ల కోసం రష్యాను కోరింది. ఈ విషయాన్ని రక్షణ వర్గాలు వెల్లడించాయి. పహెల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్, పీవోకేలోని తొమ్మిది ఉగ్రస్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. అనంతరం పాకిస్తాన్ భారత్‌పై డ్రోన్లు, మిస్సైల్స్ దాడికి ప్రయత్నించింది. ఆ సమయంలో సరిహద్దుల్లో మోహరించిన ఎస్-400 మిస్సైల్ సిస్టమ్ వాటిని అడ్డుకుంది. కచ్చితత్వంతో సరిహద్దు నుంచి వైమానిక ముప్పును ఎదుర్కోవడంలో ఈ వ్యవస్థ సమర్థవంతంగా పని చేసింది. దీంతో, భారత్ తన వైమానిక రక్షణ సామర్థ్యాన్ని మరింత విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. మరిన్ని ఎస్-400 లను రష్యా నుంచి దిగుమతి చేసుకోవాలనుకుంటుంది. కాగా.. భారత్ అభ్యర్థనను రష్యా అంగీకారం తెలిపిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్
రష్యాలో తయారు చేసిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను భారత్‌లో ‘సుదర్శన్ చక్ర’గా పిలుస్తూ వస్తున్నారు. ఎస్-400 ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని సులభంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు అవకాశం ఉంటుంది. ఒక వాహనంపై అమర్చవచ్చు. ఒకేసారి మల్టిపుల్ టార్గెట్స్‌ని ధ్వంసం చేస్తుంది. ఒకేసారి 36 టార్గెట్‌లను ట్రాక్ చేసే సామర్థ్యం దీనికి ఉంది. అలాగే, 12 టార్గెట్స్‌పై ఒకే సారి దాడి చేస్తుంది. 600 కిలోమీటర్ల దూరం నుంచే ట్రాక్ చేస్తూ.. 400 కిలోమీటర్ల పరిధిలోనే శత్రువుల మిస్సైల్స్‌ను కూల్చే సామర్థ్యం ఉంది. విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ ఇలా వేర్వేరు లక్ష్యాలను ఒకేసారి టార్గెట్ చేసి ఛేదిస్తుంది. అంతేకాకుండా రియాక్షన్ టైమ్ కూడా చాలా వేగంగా ఉంటుంది. ఎస్-400 యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఫైర్ చేసేందుకు ఐదు నిమిషాల్లోనే రెడీ చేయొచ్చు. ఇందులో 3డీ ఫేజ్‌డ్ అరే రాడార్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ మిస్సైల్ సిస్టమ్ కోసం భారత్ సుమారు రూ.35వేలకోట్లతో రష్యాతో ఒప్పందం చేసుకుంది. కాగా.. ఇప్పటి వరకు ఐదు యూనిట్లను మాత్రమే డెలివరీ చేసుకుంది.






