అదంతా ఫేక్.. నాటో చీఫ్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన భార‌త్

by Ajay Maddhiboyina |

అమెరికా సుంకాలు విధించ‌డంతో ప్ర‌ధాని మోడీ ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ను సంప్ర‌దించాడ‌ని నాటో చీఫ్ మార్క్ రూటె చేసిన వ్యాఖ్య‌ల‌పై భార‌త్ స్పందించింది. ఈ మేర‌కు భార‌త విదేశాంగ మంత్రిత్వ‌శాఖ ప్ర‌తినిధి ర‌ణ‌ధీర్ జైస్వాల్ రూటె వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు.

అదంతా ఫేక్.. నాటో చీఫ్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన భార‌త్
X

దిశ‌, వెబ్ డెస్క్: అమెరికా సుంకాలు విధించ‌డంతో ప్ర‌ధాని మోడీ ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ను సంప్ర‌దించాడ‌ని నాటో చీఫ్ మార్క్ రూటె చేసిన వ్యాఖ్య‌ల‌పై భార‌త్ స్పందించింది. ఈ మేర‌కు భార‌త విదేశాంగ మంత్రిత్వ‌శాఖ ప్ర‌తినిధి ర‌ణ‌ధీర్ జైస్వాల్ రూటె వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు. మోడీ పుతిన్ తో అలా ఎప్పుడూ మాట్లాడ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. అలాంటి సంభాష‌ణే వారిద్ద‌రి మ‌ధ్య ఎప్పుడూ జ‌ర‌గ‌లేద‌ని, రూటె వ్యాఖ్య‌లు ఆమోద‌యోగ్య‌మైన‌వి కావన్నారు.

నాటో చీఫ్ బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని హిత‌వుప‌లికారు. ఇదిలా ఉంటే ట్రంప్ సుంకాలు విధించ‌డంతో పుతిన్ తో మోడీ మాట్లాడార‌ని రూటె ఆరోపించారు. ఉక్రెయిన్ తో యుద్ధం ఆపాల‌ని ట్రంప్ సూచించినా ర‌ష్యా వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డంతో ఆ దేశం నుండి చ‌మురు కొనుగోలు చేసే దేశాల‌పై సుంకాలు ఎక్కువ విధించారని చెప్పారు. ఉక్రెయిన్ పై రష్యా వ్యూహం ఏంట‌ని కూడా మోడీ పుతిన్ ను అడిగార‌ని ఆరోపించారు. రూటె చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ గా మార‌డంతో ఇప్పుడు భారత్ ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను ఖండించింది.

Next Story