India: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. కొత్తగా మరో 500 కేసులు

by Shamantha N |

దేశంలో కరోనా(Corona virus) కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు 500 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

India: దేశంలో కరోనా డేంజర్ బెల్స్..  కొత్తగా మరో 500 కేసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో కరోనా(Corona virus) కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు 500 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో, యాక్టివ్ కేసుల సంఖ్య 5 వేలకు పైగా పెరిగినట్లయ్యింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ డేటా ప్రకారం.. జూన్‌ 6న ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 5,364లకు చేరింది. గత 24 గంటల్లో 498 కొత్త కేసులు నమోదవగా నలుగురు చనిపోయారు. దీంతో, కరోనా వల్ల చనిపోయినవారి సంఖ్య 55కి చేరినట్లయ్యింది. మరణించిన వారిలో ఇద్దరు కేరళకు చెందినవారు కాగా.. పంజాబ్, కర్ణాటకలలో ఒక్కొక్కరు ఉన్నారు. కేరళలోనే అత్యధికంగా 1,679 యాక్టివ్‌ కేసులు ఉండగా.. గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కేసుల సంఖ్య పెరుగుకతుండటంతో.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అడ్వైజరీ జారీ చేసింది. ఆక్సిజన్ సహా సంబంధిత మందులు, వైద్యసామగ్ర లభ్యతను నిర్ధారించుకోవాలని కోరింది. కోవిడ్-19 సహా ఇతర వైరల్ జ్వరాలను గుర్తించే ప్రాముఖ్యతను ఆరోగ్య నిపుణులు నొక్కి చెబుతున్నారు.

Next Story