- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
China: చైనా వ్యర్థ, విఫల ప్రయత్నాలను మేం గమనించాం- విదేశాంగ శాఖ
అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh)ని తనభూభాగంగా మార్చుకునేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను భారత్ మరోసారి తీవ్రంగా ఖండించింది. ఆ రాష్ట్రాన్ని చైనా తమ మ్యాప్‌లో చూపించుకుంటుంది.

దిశ, నేషనల్ బ్యూరో: అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh)ని తనభూభాగంగా మార్చుకునేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను భారత్ మరోసారి తీవ్రంగా ఖండించింది. ఆ రాష్ట్రాన్ని చైనా తమ మ్యాప్‌లో చూపించుకుంటుంది. ఇక అరుణాచల్‌లోని పేర్లను కూడా చైనా మార్చేసింది. ఆరాష్ట్రాన్ని జాంగ్‌నాన్‌గా చైనా తన మ్యాప్ లో చూపిస్తుంది. టిబెట్‌కు దక్షిణ భాగంగా అందులో పేర్కొంది. అయితే, అరుణాచల్ ప్రదేశ్ కు కొత్తగా పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. ‘‘భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రదేశాలకు పేర్లు పెట్టడానికి చైనా వ్యర్థ, విఫల ప్రయత్నాలు చేస్తున్నట్లు మేం గమనించాం. ఇది మా వైఖరికి విరుద్ధం. అలాంటి ప్రయత్నాలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అరుణాచల్‌ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగం.. ఆ ప్రాంతం భారత్ లో విడదీయరాని భాగమని.. పేర్లు మార్చినంత మాత్రాన ఈ వాస్తవాన్ని మార్చలేరని’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ (Randhir Jaiswal ) స్పష్టం చేశారు.
తరచూ మ్యాప్ ల విడుదల
అరుణాచల్ ప్రదేశ్ తన భూభాగమని చెప్పుకునే చైనా.. అనే ప్రాంతాల పేర్లు మార్చి తరచూ మ్యాప్ లను విడుదల చేస్తుంది. బీజింగ్ గతంలో వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లోని పేర్లను మార్చేందుకు ప్రయత్నిస్తూ నాలుగు జాబితాలను విడుదల చేసింది. 2017లో ఆరు ప్రదేశాలకు పేర్లు మార్చుతూ ఓ జాబితా విడుదల చేసింది. ఆ తర్వాత 2021లో 15 ప్రాంతాలకు, 2023లో 11 ప్రాంతాలకు, 2024లో మరో 30 ప్రాంతాలకు పేర్లను మార్చుతూ చైనా జాబితాను విడుదల చేసింది. అయితే, ఇలాంటి ప్రయత్నాలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. మరోవైపు, అరుణాచల్ ప్రదేశ్‌పై ప్రాదేశిక వివాదం తర్వాత, ఈ ప్రాంతంలో నీటి వనరుల వినియోగంపై ఆందోళనల లేవెనత్తింది. టిబెట్‌లోని మెడోగ్ కౌంటీలోని యార్లుంగ్ త్సాంగ్పో నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ఆనకట్టగా నిర్మించాలని చైనా భావిస్తుంది. కాగా.. ఆ నది సియాంగ్ గా భారత్ లోకి ప్రవేశించి.. ఆ తర్వాత అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో కలుస్తోంది. అయితే, దీన్ని బీజేపీ నేత తపిర్ గావో వాటర్ బాంబ్ గా అభివర్ణించారు. చైనా ఇప్పటికే 60,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగల సామర్థ్యం గల ఆనకట్టను నిర్మించాలని నిర్ణయించింది. అయితే, దీని వల్ల భారత్ సహా ఇతర దిగువ నదీ తీరదేశాలపై వాడే వాటర్ బాంబ్ అన్నారు. చైనా వైపు నుండి ఆకస్మిక నీటి విడుదల తలెత్తే అవకాశం ఉందన్నారు. జూన్ 2000 నాటి వరదలను గుర్తుచేశారు. ఆకస్మిక నీటి విడుదల వల్ల అరుణాచల్ ప్రదేశ్‌లో పదికి పైగా వంతెనలు ధ్వంసమయ్యాయని ఆయన పేర్కొన్నారు.






