- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India Tariffs: అమెరికా వస్తువులపై భారత్ ప్రతీకార సుంకాలు?
అమెరికా విధించిన టారిఫ్ ల కారణంగా సుమారు 7 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఉత్పత్తులపై ప్రభావం ఉంటుందని, టారిఫ్ ల మొత్తం 2 బిలియన్ డాలర్ల వరకూ ఉండవచ్చని WTO కమ్యూనికేషన్ సూచించింది.

దిశ, వెబ్‌డెస్క్: భారత్ లో ఉత్పత్తయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా విధించిన టారిఫ్ లకు ప్రతిస్పందనగా.. అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్ లు వివిధించాలని ప్రతిపాదిస్తున్నట్లు భారతదేశం ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)కు తెలిపింది. ఈ రెండు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం పై చర్చలు జరుపుతుండటంతో.. ఈ ప్రతిపాదన ప్రాముఖ్యతను సంతరించుకుంది.
అమెరికా విధించిన టారిఫ్ ల కారణంగా సుమారు 7 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఉత్పత్తులపై ప్రభావం ఉంటుందని, టారిఫ్ ల మొత్తం 2 బిలియన్ డాలర్ల వరకూ ఉండవచ్చని WTO కమ్యూనికేషన్ సూచించింది. గతంలో అమెరికా భారత్ ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్ లు విధించిన విషయం తెలిసిందే. రెండోసారి అధికారం చేపట్టిన ట్రంప్.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలపై భారీఎత్తున టారిఫ్ లు విధించారు. అయితే భారత్ క్రూడ్ స్టీల్ తయారీలో రెండో స్థానంలో ఉండగా.. ట్రంప్ టారిఫ్ ల ఎఫెక్ట్ ఆ రంగంపై పడనుంది. ఈ క్రమంలో భారత్.. అమెరికా ఉత్పత్తులపై టారిఫ్ లు విధించే అంశాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ వద్ద బలంగా ప్రస్తావించడం ఇరుదేశాల మధ్య వాణిజ్య ఘర్షణ పెరుగుతోందనేందుకు సంకేతంగా నిలిచిందనడంలో సందేహం లేదంటున్నారు నిపుణులు.






