భారత్, పాక్ యుద్ధం.. ఇరు దేశాల అతి పెద్ద మిస్సైళ్ల రేంజ్ ఎంతంటే?

by Yella Dhawani Reddy |

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

భారత్, పాక్ యుద్ధం.. ఇరు దేశాల అతి పెద్ద మిస్సైళ్ల రేంజ్ ఎంతంటే?
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉగ్ర దాడికి భారత్ 'ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)' చేపట్టి ప్రతీకారం తీర్చుకుంది. భారత సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఈ దాడుల తర్వాత పాక్ సైన్యం రెచ్చిపోయి కాల్పులకు తెగబడింది. ఈ నేపథ్యంలో బాలిస్టిక్ క్షిపణుల (Ballistic missiles) అభివృద్ధిలో ముందంజలో ఉన్న భారత్, పాక్ దేశాల అణ్వస్త్ర బలగాల సామర్థ్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

భారత్ న్యూక్లియర్ పాలసీ ప్రకారం.. ముందుగా శత్రు దేశం అణ్వాయుధాలతో దాడి చేస్తేనే తిరిగి ఇండియా న్యూక్లియర్ అటాక్ చేస్తోంది. కానీ, పాకిస్థాన్ మాత్రం అలా కాదు. తమ సైన్యానికి, సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లతుందని, నష్టం జరుగుతుందని భావిస్తే అణ్వాయుధాలు ప్రయోగిస్తోంది.

భారత క్షిపణుల రేంజ్:

భారత్, పాకిస్థాన్ రెండు దేశాలు అణ్వస్త్రాలను కలిగి ఉన్నాయి. అయితే, భారత్‌ వద్ద ఉన్న మిస్సైల్స్‌తో పోల్చితే పాకిస్థాన్‌ వద్ద ఉన్న మిస్సైల్స్‌ రేంజ్‌, టెక్నాలజీ చాలా తక్కువ ఉన్నట్లు సమాచారం. ఇక భారత దీర్ఘ శ్రేణి క్షిపణుల సామర్థ్యం పాకిస్థాన్‌ మిస్సైళ్ల కన్నా చాలా రెట్లు ఎక్కువ. వీటిలో బాలిస్టిక్, క్రూయిజ్, ఎయిర్-టు-ఎయిర్, సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణులు ఉన్నాయి. భారత్ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) నేతృత్వంలో అగ్ని క్షిపణిని అభివృద్ధి చేసుకుంది.

అగ్ని-V: ఇది ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి (ICBM). దీని పరిధి సుమారు 5,000–8,000 కిలోమీటర్లు. న్యూక్లియర్ వార్‌హెడ్ సామర్థ్యం (MIRV) ఉంది. లక్ష్యాలను స్వతంత్రంగా ఛేదించే రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ ఇందులో ఉంటుంది.

అగ్ని-VI: ఈ క్షిపణులను భారత్‌ ప్రస్తుతం అభివృద్ధి చేసుకుంటోంది. దీని రేంజ్ 10,000 కిలోమీటర్ల కంటే అధికంగా ఉంటుంది. వీటిలో కూడా MIRV టెక్నాలజీ ఉంటుంది.

పాకిస్థాన్ క్షిపణి సామర్థ్యం:

పాకిస్థాన్ ప్రధానంగా తమపై జరిగే దాడులను తిప్పికొట్టడం, భారత్‌ లక్ష్యంగా మిస్సైళ్లను సమకూర్చుకుంటోంది. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు ప్రధాన ఆయుధాలు. అందులో షాహీన్ సిరీస్ మిసైళ్లు ముఖ్యమైనవి. అబాబీల్, బాబర్, ఫతా, గౌరీ కూడా ఉన్నాయి. అతి దూర లక్ష్యాలను ఈ క్షిపణులు ఛేదించలేవు. అయితే, భారత్‌లోని తమ అన్ని టార్గెట్‌లను మాత్రం ఛేదించే సామర్థ్యం వీటికి ఉంది.

షాహీన్-III క్షిపణి: ఇది మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. దీని పరిధి 2,750 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీనికి న్యూక్లియర్ వార్‌హెడ్ సామర్థ్యం కూడా ఉంది.

అబాబీల్: ఈ క్షిపణిని మొదటిసారి 2017లో పరీక్షించారు. దీని పరిధి సుమారు 2,200 కిలోమీటర్లు. ఇందులో మల్టీపుల్ ఇండిపెండెంట్ రీ-ఎంట్రీ వెహికల్ (MIRV) టెక్నాలజీ ఉంది. వార్‌హెడ్‌లను మోయడానికి దీన్ని రూపొందించారు. అలాగే, భారతదేశ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ (BMD) వ్యవస్థలను దాటిపోయే సామర్థ్యం కలిగి ఉంది.

Next Story