- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్, పాక్ యుద్ధం.. మిస్ వరల్డ్ పోటీల నిర్వాహణపై సందిగ్ధత
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతికారంగా మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది.

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతికారంగా మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. దీంతో భారత్, పాక్ మధ్య యుద్ధానికి తొలి అడుగు పడినట్లైంది. ఈ పరిణామాలు భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలను మరింత ఉద్రిక్తతకు దారి తీయనుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ప్రజలకు యుద్ధం అనేది జరుగుతున్న నేపథ్యంలో ఎలా ఉండాలి.. ఎలా వ్యవహరించాలి.. ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలి.. అనే విషయాలపైన కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించి అవగాహన కల్పిస్తోంది. మరోవైపు దేశంలోని చాలా ఎయిర్ పోర్టులను భారత్ మూసివేసింది. దీంతో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది.
అయితే, తెలంగాణలోని హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. ఇవాళ (మే 7వ తేదీ) ప్రారంభమై 31 వరకు జరగనున్నాయి. దాదాపు 120 దేశాల నుంచి ప్రతినిధులు ఈ పోటీలను వస్తున్నారు. ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికే ఘనంగా ఏర్పాట్లు చేసింది. అయితే, ఉద్రికత్తల నేపథ్యంలో ఈ పోటీలపై అనిశ్చితి నెలకొంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో నిర్వాహకులు షెడ్యూల్ మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతాపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న క్రమంలో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై డైలమాలో పడ్డారు నిర్వాహకులు. షెడ్యూల్ మార్పుపై ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ రాకతో హైదరాబాద్ సందడిగా మారింది.






