- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ -పాక్ ఉద్రిక్తతలు.. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు
ఆపరేషన్ సిందూర్(Operaion Sindoor) తర్వాత భారత్ -పాక్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సిందూర్(Operaion Sindoor) తర్వాత భారత్ -పాక్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. గురువారం పాక్ చేపట్టిన కవ్వింపు చర్యలకు భారత ఆర్మీ ధీటుగా సమాధానం ఇచ్చింది. దీనిపై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ (Raasthan Former CM Ashok Gehlat) మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. మన సైన్యం చూపిన ధైర్యసహసాల పట్ల గర్విస్తున్నానని అన్నారు. అలాగే పాకిస్థాన్ చేస్తున్న ప్రతీ దాడిని మన సైన్యం వీరోచితంగా అడ్డుకుంటున్నారని తెలిపారు.
మన దేశ సైనికులు పౌర, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం లేదని, కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. అంతేగాక ఉగ్రవాదాన్ని (Terrorism) ఏ దేశం కూడా సహంచదని అన్నారు. ఇక ఉగ్రవాదానికి భారతీయులందరూ ఐక్యంగా ఉన్నారని తెలిపేందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ (Congress) తిరంగాయాత్ర (Thiranga Yathra) చేపడుతోందని తెలిపారు. ఇక మనందరం కలిసే ఉన్నామని రాహుల్ గాంధీ (Rahul Gandhi) సహా ఇతర అన్నీ పార్టీలు సూచిస్తున్నాయని, ఇదే విజయాన్ని నిర్ధారిస్తుందని చెప్పారు. దీంతో భారత సైన్యాలు పాక్ కు ధీటుగా సమాధానం ఇస్తున్నాయని గెహ్లాట్ వివరించారు.






