ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో అలర్ట్.. భారతీయులను స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు

by Gantepaka Srikanth |

ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత(India) ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో అలర్ట్.. భారతీయులను స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత(India) ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్‌లోని భారతీయులను దేశానికి తరలించే ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఇప్పటికే ఇరాన్ నుంచి అనుమతి తీసుకోగా, వారు సైతం పర్మిషన్ ఇచ్చారు. ఇరాన్‌లో దాదాపు 10 వేల పైచిలుకు భారతీయులు ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. ఇరాన్‌ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ భీకర దాడులు (Israel-Iran War) కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడులతో టెహ్రాన్‌లోని పలు కీలక ప్రాంతాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలోనే ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ (Iran Supreme Leader Khamenei)ని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఈశాన్య టెహ్రాన్‌లోని అండర్‌గ్రౌండ్‌ బంకర్‌లో ఖమేనీ కుటుంబంతో కలిసి తలదాచుకున్నట్లు సమాచారం.

Next Story