- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రూ. 80,000 కోట్ల మెగా డీల్‌కు ఓకే
దిశ, నేషనల్ బ్యూరో: మన దేశ భద్రతా బలగాలను మరింత బలోపేతం చేసే నిర్ణయాన్ని కేంద్రం తీసుకున్నది. డిఫెన్స్ ఫోర్స్ నిఘా సామర్థ్యాలను పెంచడానికి అమెరికా నుంచి ప్రిడేటర్ డ్రోన్లను కొనగోలు చేయడానికి కేబినెట్ కమిటీ (సెక్యూరిటీ) అంగీకారం తెలిపింది. నావికా దళాన్ని మరింత పరిపుష్టంగావించడానికి రెండు న్యూక్లియర్ సబ్‌మెరైన్లను దేశీయంగా తయారు చేసుకోవడానికి సంబంధించిన డీల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కేబినెట్ కమిటీ ప్రణాళికల ప్రకారం, హిందూ మహాసముద్ర ప్రాంతంలో రెండు న్యూక్లియర్ సహిత సబ్ మెరైన్లను భారత నేవీకి అందనున్నాయి. విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లో రూ. 45000 కోట్లతో రెండు సబ్ మెరైన్లను నిర్మించనున్నారు. ఈ నిర్మాణంలో ప్రైవేటు సెక్టార్ కూడా భాగం అవుతుంది. 31 ఎంక్యూ-9బీ ప్రిడేటర్ డ్రోన్లు కొనుగోలు చేసి అందులో 15 యూనిట్లు ఇండియన్ నేవీకి, ఎయిర్‌ఫోర్స్‌కు, ఆర్మీకి 8 చొప్పున అందించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.