- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shashi Tharoor: భారత్ ఎప్పుడూ ఎవరినీ అడగలేదు: రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై శశి థరూర్
ఎప్పుడూ మూడో పక్షం జోక్యం లేదని స్పష్టం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్‌పై భారత్ దాడులకు సంబంధించి ప్రధాని నరేద్ర మోడీపై ప్రతిపక్ష, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాహుల్ గాంధీ విమర్శలపై కాంగ్రెస్ నేత శశి థరూర్ స్పందించారు. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించే అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న శశి థరూర్.. ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. భారత్, పాకిస్తాన్ వివాదానికి సంబంధించి ఏ సమయంలోనూ, ఎప్పుడూ మూడో పక్షం జోక్యం లేదని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య శాంతికి అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న వాదనల ప్రస్తావిస్తూ , 'భారత్‌ను యుద్ధం ఆపమని ఒప్పించాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ ఆగితే, మేము ఆపడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి వారు పాకిస్తాన్‌ను 'మీరు ఆపండి ఎందుకంటే భారత్ ఆపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఉండవచ్చు. అమెరికా అదే చేసింది. అది అమెరికా వైపు నుంచి చెప్పుకోదగిన చర్య ' అని అన్నారు. ఇటీవల ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్‌పై దాడులపై ప్రతిపక్ష, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ ఫోన్‌లో 'నరెందర్ సరెండర్ ' అనగానే యుద్ధం ఆపేశారని రాహుల్ గాంధీ రాజకీయ తుఫానును రేకెత్తించారు. 1971లో అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదని పేర్కోన్నారు.
ట్రంప్ వాదనలను రాహుల్ గాంధీ ప్రస్తావించడం గురించి శశి థరూర్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ నుంచి ఏదైనా ఉగ్రవాద దాడులు జరిగితే, భవిష్యత్తులో కూడా అంతకుమించిన స్థాయిలో భారత్ బదులిచ్చేందుకు సిద్ధంగా ఉందని థరూర్ అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద భాషను ఉపయోగించినంత కాలం, వారిలాగే స్పందించేందుకు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మేము అదే భాషను ఉపయోగిస్తాము. దానికి మూడో పక్షం అవసరం లేదని శశి థరూర్ వెల్లడించారు.






