- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
World Bank: భారత్ నిర్మాణాత్మక సంస్కరణలను వేగవంతం చేయాలి
భారత్ తన నిర్మాణాత్మక సంస్కరణలను మరింత వేగవంతం చేయాలని అభిప్రాయపడ్డారు.

దిశ, నేషనల్ బ్యూరో: కొంతకాలంగా ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంతో మిగిలిన దేశాల కంటే భారత్ మెరుగైన స్థానంలో ఉందని ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనమిస్ట్ ఇందర్మిత్ గిల్ అన్నారు. అయితే, భారత్ తన నిర్మాణాత్మక సంస్కరణలను మరింత వేగవంతం చేయాలని అభిప్రాయపడ్డారు. గురువారం పరిశ్రమల సమాఖ్య సీఐఐ సదస్సులో మాట్లాడిన ఆయన.. భారత్ తన నిర్మాణాత్మక సంస్కరణలను వేగవంతం చేసేందుకు ఇది సరైన సమయం ఆసన్నమైంది. అయితే, అవసరమైన మార్పులు త్వరగా జరగడంలేదు. బలహీనతలను అధిగమించే సందర్భంలో, సంస్థాగత స్థిరత్వాన్ని పెంపొందించేటప్పుడు ఆర్థికవ్యవస్థ బలాలను ఉపయోగించుకోవాలని విధాన రూపకర్తలను గిల్ కోరారు. గత రెండు దశాబ్దాలుగా అభివృద్ధి చెందిన ఆర్థికవ్యవస్థల్లో వృద్ధి రేటు సగానికి తగ్గడంతో ప్రపంచ ఆర్థిక వృద్ధి క్షీణించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య సమస్యలు, విధానాల అనిశ్చితి, ద్రవ్యోల్బణం వల్ల అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు కూడా వృద్ధి రేటులో క్షీణతను చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. భారత ఆర్థికవ్యవస్థలో ఉన్న ప్రధాన నిర్మాణాత్మక బలహీనతలను ప్రస్తావించిన ఆయన, మూలధన నిధులను తక్కువగా ఉపయోగించాలని, ఉత్పాదకత లేని సంస్థలు కార్యకలాపాలను కొనసాగించడం, మరింత సమర్థవంతమైన, విలువైన సంస్థలకు వనరుల కేటాయింపులను పెంచడం వంటి చర్యలు అవసరమన్నారు. అలాగే, తక్కువ ప్రతిభ అవసరమైన నియామకాలను తగ్గించాలని సూచించారు.






