India : ‘26/11‌’కు వాళ్లు బదులివ్వలేదు.. ఉరిపై ఉగ్రదాడికి మేం బదులిచ్చాం : జైశంకర్

by Hajipasha |
India : ‘26/11‌’కు వాళ్లు బదులివ్వలేదు.. ఉరిపై ఉగ్రదాడికి మేం బదులిచ్చాం : జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇది మునుపటి భారత్(India) కాదని.. ఆత్మరక్షణ విషయంలో దేశం వైఖరి మారిపోయిందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్(S Jaishankar) పేర్కొన్నారు. ‘‘2008లో ముంబైపై జరిగిన 26/11 ఉగ్రదాడికి నాటి యూపీఏ ప్రభుత్వం ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదు. కానీ 2016లో కశ్మీరులోని ఉరిపై జరిగిన ఉగ్రదాడికి మా ప్రభుత్వం స్పందించింది. పాక్(Pak) ఆక్రమిత కశ్మీరులోని బాలాకోట్‌పై సర్జికల్ స్ట్రైక్స్‌(Balakot strikes)తో బదులిచ్చింది’’ అని ఆయన తెలిపారు.

ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన ‘క్వాడ్’ కూటమిని బలోపేతం చేయడంలో గతంలో డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారన్నారు. కచ్చితంగా ఆ క్రెడిట్‌ను ట్రంప్‌కు ఇవ్వాల్సిందేేనని జైశంకర్ తెలిపారు. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక ‘క్వాడ్’‌ను మరింత బలోపేతం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed