- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India- Lanka: భారత్- శ్రీలంక మధ్య కీలక రక్షణ ఒప్పందం..!
భారత్- శ్రీలంక మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదురింది. శ్రీలంక పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశ అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకేతో సమావేశమయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్- శ్రీలంక మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదురింది. శ్రీలంక పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశ అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకేతో సమావేశమయ్యారు. ఆతర్వాత రక్షణ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ మేరకు సంతకాలు జరిగాయి. ట్రింకోమలీని ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడం, శ్రీలంక తూర్పు ప్రాంతానికి భారత్ గ్రాంట్ అందించడం వంటి ఒప్పందాలు జరిగాయి. అలాగే ఇద్దరు నేతలు సాంపూర్ సౌర విద్యుత్ ప్రాజెక్టును వర్చువల్‌గా ప్రారంభించారు. థాయ్‌లాండ్‌లో బిమ్‌స్టెక్ సదస్సు ముగిసిన తర్వాత శుక్రవారం సాయంత్రం ప్రధాని మోడీ నేరుగా అక్కడకు చేరకున్నారు. బండారునాయకే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగిన ఆయనను లంక ప్రభుత్వం ఘనంగా స్వాగతించింది. శనివారం ఉదయం ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద అధ్యక్షుడు సంప్రదాయ పద్ధతుల్లో ఆహ్వానం పలికారు. ఇరుదేశాల మధ్య ఉన్న చరిత్రాత్మక సంబంధాలకు ప్రతీకగా స్వాగతం నిలిచింది. 1948లో బ్రిటిష్ పాలన నుండి ఆ దేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత నిర్మించిన స్మారక మందిరానికి ఇండిపెండెన్స్ స్క్వేర్ అని పేరు వచ్చింది.
జాలర్లకు రిలీఫ్
అంతేకాకుండా, ప్రధాని మోడీ(PM Modi), శ్రీలకం అధ్యక్షుడు అనుర కుమార దగ్గర తమిళ జాలర్ల సమస్యను లేవనెత్తారు. రెండు దేశాల మధ్య ఏన్నో ఏళ్లుగా ఈ అంశం నలుగుతోంది. దానికి పరిష్కారం చూపే దిశగా పర్యటనలో చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే (Sri Lankan President Anura Kumara Dissanayake) వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించారు. తమిళ జాలర్లను వెంటనే విడుదల చేయాలని, వారి పడవలను విడిచిపెట్టాలని కోరారు. కాగా.. భారతీయ మత్స్యకారులను వెంటనే విడుదల చేయడానికి శ్రీలంక అంగీకరించిందని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా, వారి పడవలను తిరిగి ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్లు పేర్కొన్నాయి.
మోడీకి అత్యున్నత పురస్కారం
భారత ప్రధాని నరేంద్ర మోడీకి శ్రీలంక ప్రభుత్వ అత్యున్నత పురస్కారం అందుకున్నారు. ద్వీపదేశ అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే (Sri Lankan President Anura Kumara Dissanayake) ‘శ్రీలంక మిత్ర విభూషణ’ (Sri Lanka Mitra Vibhushana) పురస్కారాన్ని మోడీకి అందజేశారు. మూడ్రోజుల పర్యటనలో భాగంగా మోడీ శ్రీలంకలో పర్యటిస్తున్నారు మరోవైపు, ఇది ప్రధాని మోడీకి లభించిన 22వ అంతర్జాతీయ అవార్డు. కాగా.. శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో మోడీ పర్యటన జరిగింది. కాగా.. మూడేళ్ల క్రితం ద్వీప దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు భారత్ 4.5 బిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక సహాయాన్ని అందించింది.






