- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్ తొలిసారి స్పందించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి(Khamenei Death)పై భారత్ తొలిసారి స్పందించింది. ఈ సందర్భంగా ఖమేనీ మృతికి సంతాపం ప్రకటించింది. ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీకి భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెళ్లి అధికారికంగా సంతాప సందేశం రాసిచ్చారు. అంతకుముందు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం కీలక స్పందన తెలియజేశారు. ఏ రకమైన వివాదాన్నైనా పరిష్కరించుకోవడానికి 'చట్టబద్ధ పాలన, చర్చలు మరియు దౌత్యం' అనే మూడు సూత్రాలే అత్యవసరమని ఆయన ఉద్ఘాటించారు. కేవలం సైనిక పోరాటాల ద్వారా మాత్రమే ఏ సమస్యకూ పరిష్కారం లభించదని ఆయన స్పష్టం చేశారు.
శాంతి ప్రయత్నాలకు భారత్ మద్దతు
ఢిల్లీలో ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర యుద్ధం, అలాగే రష్యా-ఉక్రెయిన్ సంక్షోభాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "భారత్ మరియు ఫిన్లాండ్ రెండూ కూడా చర్చలు, దౌత్య మార్గాలను విశ్వసిస్తాయి. అది ఉక్రెయిన్ కావచ్చు లేదా పశ్చిమ ఆసియా కావచ్చు, యుద్ధాలు త్వరగా ముగియాలని, శాంతి వైపు అడుగులు పడాలని మేము కోరుకుంటున్నాము" అని మోడీ అన్నారు.






