Pakistan Minister: రాబోయే కొన్ని గంటల్లో పాక్ పై సైనిక చర్యలు

by Shamantha N |   (  Updated:2025-04-30 06:25:57  IST  )

పాకిస్థాన్ సమాచార మంత్రి అతుల్లా తరార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ పై భారతదేశం యుద్ధం చేయబోతుందన్నారు. "రాబోయే 24 నుండి 36 గంటల్లో భారతదేశం పాకిస్థాన్‌పై సైనిక దాడికి ప్రణాళికలు వేస్తున్నట్లు మాకు విశ్వసనీయ నిఘా ఆధారిత సమాచారం ఉంది.

Pakistan Minister: రాబోయే కొన్ని గంటల్లో పాక్ పై సైనిక చర్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ సమాచార మంత్రి అతుల్లా తరార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ పై భారతదేశం యుద్ధం చేయబోతుందన్నారు. "రాబోయే 24 నుండి 36 గంటల్లో భారతదేశం పాకిస్థాన్‌పై సైనిక దాడికి ప్రణాళికలు వేస్తున్నట్లు మాకు విశ్వసనీయ నిఘా ఆధారిత సమాచారం ఉంది. భారతదేశం తీసుకునే ఏ చర్యకైనా పూర్తి శక్తితో ఇస్లామాబాద్ ప్రతిస్పందిస్తుంది. పాక్ తన భూభాగాన్ని అన్ని విధాలుగా రక్షించుకుంటుంది. దేశం తన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను అవసరమైన అన్ని విధాలుగా కాపాడుకుంటుంది. భారత్ పాక్ పై యుద్ధం చేసేందుకు ప్రయత్నిస్తే, వినాశకరమైన నష్టాలకు ఆ దేశమే పూర్తిగా బాధ్యత వహిస్తుంది" అని ఆయన అన్నారు. పాక్ పై భారత్ చేస్తున్న ప్రణాళికబద్ధమైన దురాక్రమణను అంతర్జాతీయ సమాజం గమనించాలని తరార్ పిలుపునిచ్చారు.

సైనిక చర్య..

పహెల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ ప్రేమం ఉందనే నిరాధార ఆరోపణలతో సైనిక చర్య తీసుకునేందుకు భారత్ సిద్ధమవుతోందని పాకిస్తాన్‌ సమాచార మంత్రి అతుల్లా తరార్‌ పేర్కొన్నారు. పాకిస్తాన్‌ సైతం ఉగ్రవాద బాధిత దేశంగా ఉందని పేర్కొన్నారు. పహల్గాం దాడిలో నిజానిజాలను తెలుసుకునేందుకు ఇస్లామాబాద్‌ నిపుణుల కమిషన్‌ ద్వారా విశ్వసనీయమైన, పారదర్శకమైన స్వతంత్ర దర్యాప్తునకు ప్రతిపాదించిందని.. భారత్‌ ఇందుకు అంగీకరించలేదన్నారు. భారత్ కావాలనే యుద్ధం చేస్తుందన్నారు. మరోవైపు, భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం త్రివిధ దళాలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించారు. సాయుధ దళాల సామర్థ్యంపై ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భారత సైన్యం తమపై దాడి చేయబోతుందనే భయాందోళనలకు గురవుతోంది.

Next Story