- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India: సుంకాల తర్వాత ఇతర దేశాల కంటే మెరుగ్గా భారత్.. ఎన్ఎస్ఈ సీఈఓ ఆశిష్ కుమార్
అమెరికా పరస్పర సుంకాలు విధించిన తర్వాత ఇతర దేశాల కంటే భారత్ మెరుగ్గానే పని చేస్తోందని ఎన్ఎస్ఈ సీఈఓ ఆశిష్ కుమార్ చౌహాన్ తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా (America) పరస్పర సుంకాలు విధించిన తర్వాత ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భారత్ మెరుగ్గానే పని చేస్తోందని నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (NSE) సీఈఓ ఆశిష్ కుమార్ చౌహాన్ (Aashish kumar Chauhan) తెలిపారు. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత స్పష్టంగా తెలుస్తుందని అంచనా వేశారు. ఆదివారం ఆయన జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పరస్పర టారిఫ్స్‌పై అమెరికా నిర్ణయం తర్వాత భారత షేర్ మార్కెట్ ఇతర దేశాల కంటే చాలా మెరుగ్గా కొనసాగుతున్నట్టు కనిపిస్తోందన్నారు. ‘అమెరికా సుంకాలపై నిర్ణయం తీసుకుంది. ఇది ప్రపంచంలోని ప్రతి దేశానికీ వర్తిస్తుంది. భారత్ పై కూడా దిగుమతి సుంకాలను విధించారు. ఈ పరిస్థితుల్లో ఇతర దేశాలు ఆందోళనకు గురవుతున్నా ఇండియా మాత్రం బెటర్‌గానే ఉంది’ అని తెలిపారు.
‘యూఎస్ సుంకాల అనంతరం ఇప్పటివరకు గందరగోళ పరిస్థితి కొనసాగుతోంది. కొన్ని కంపెనీలు మరిన్ని నష్టాలను ఎదుర్కోవలసి రావొచ్చు. కానీ దీనిపై చర్చలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో మరింత స్పష్టత వస్తుంది’ అని వ్యాఖ్యానించారు. గత వారం స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 2.5 శాతానికి పైగా క్షీణించాయి. యూఎస్ సుంకాల తర్వాత నెలకొన్న ఆందోళనలే ఈ నష్టాలకు కారణమయ్యాయి. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) ప్రపంచ దేశాలపై పరస్పర సుంకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. దీని వల్ల పలు దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి.






