India: ఇండియా కూటమి వర్చువల్ సమావేశం.. కీలక అంశాలపై డిస్కషన్ !

by B.Srinivas |

పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఇండియా కూటమి శనివారం వర్చువల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

India: ఇండియా కూటమి వర్చువల్ సమావేశం.. కీలక అంశాలపై డిస్కషన్ !
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఇండియా కూటమి (India alliance) శనివారం వర్చువల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 24 పార్టీలు ఈ మీటింగ్‌కి హాజరయ్యాయి. ఉభయ సభల్లో ఐక్యంగా ఉండాలని ఈ సందర్భంగా నిర్ణయించుకున్నట్టు సమాచారం. పహెల్గాం ఉగ్రదాడి (Terror attack), ఆపరేషన్ సిందూర్‌పై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కాల్పుల విరమణ వ్యాఖ్యలు, బిహార్ లో ప్రస్తుం కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ, డీలిమిటేషన్, జమ్మూ కశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా, మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు, అహ్మదాబాద్ విమాన ప్రమాదం, నిరుద్యోగం, రైతుల సమస్యలు వంటి అంశాలను పార్లమెంటులో లేవనెత్తేందుకు కూటమిలోని పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi), లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), సీపీఐఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య సహా సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Next Story