Myanmar: మయన్మార్ కు 442 మెట్రిక్ టన్నుల ఆహార సాయం

by Shamantha N |

భూవిలయంతో అతలాకుతలం అయిన మయన్మార్ కు భారత్ ఆపన్నహస్తం అందిస్తోంది. ఆపరేషన్ బ్రహ్మలో భాగంగా దక్షిణ తీరప్రాంతంలోని తిలావా ఓడరేవు వద్ద యాంగోస్ ముఖ్యమంత్రికి భారత్ ఆహర సాయాన్ని అందజేసింది.

Myanmar: మయన్మార్ కు 442 మెట్రిక్ టన్నుల ఆహార సాయం
X

దిశ, నేషనల్ బ్యూరో: భూవిలయంతో అతలాకుతలం అయిన మయన్మార్ కు భారత్ ఆపన్నహస్తం అందిస్తోంది. ఆపరేషన్ బ్రహ్మలో భాగంగా దక్షిణ తీరప్రాంతంలోని తిలావా ఓడరేవు వద్ద యాంగోస్ ముఖ్యమంత్రికి భారత్ ఆహర సాయాన్ని అందజేసింది. శనివారం మయన్మార్‌కు దక్షిణంగా 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిలావా ఓడరేవు వద్ద నేవీ నౌక ద్వారా 442 మెట్రిక్ టన్నుల ఆహార సహాయం అందింది. 442 మెట్రిక్ ఆహార సహాయంలో 405 మెట్రిక్ టన్నుల బియ్యం, 30 మెట్రిక్ టన్నుల వంట నూనె, 5 మెట్రిక్ టన్నుల బిస్కెట్లు, 2 మెట్రిక్ టన్నుల తక్షణ నూడుల్స్ ఉన్నాయి. ఇవన్నీ మయన్మార్‌లోని బాధితుల తక్షణ ఆహార అవసరాలను తీర్చడం కోసం పంపిస్తున్నట్లు విదేశాంగమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 1న ఆహార సాయం అందించేందుకు విశాఖపట్నం నుండి ఐఎన్ఎస్ ఘరియాల్(INS Gharial) బయలుదేరింది.

భారీ భూకంపం

మార్చి 28న మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూవిలయంలో 3,100 మందికి పైగా చనిపోగా.. వందలాది మంది గాయపడ్డారు. వినాశకరమైన భూకంపం తర్వాత సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR), మానవతా సహాయం, విపత్తు ఉపశమనం, వైద్య సహాయం సహా అవసరమైన సహాయాన్ని అందించడానికి భారతదేశం ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించింది. భూవిలయం సంభవించిన 24 గంటల్లోపు మయన్మార్‌కు మొదటి విడత మానవతా సహాయం, విపత్తు ఉపశమనం (HADR) సామాగ్రిని పంపిణీ చేసింది. అంతేకాకుండా, మయన్మార్‌ (Myanmar Earthquake)ను ఆదుకొనేందుకు క్వాడ్‌ దేశాలు ముందుకువచ్చాయి. భారత్‌, అమెరికా (USA), ఆస్ట్రేలియా (Australia), జపాన్‌ దేశాలు కలిసి 20 మిలియన్‌ డాలర్లు మానవతా సాయాన్ని ప్రకటించాయి. భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ (Randhir Jaiswal) ఈ విషయాన్ని వెల్లడించారు.

Next Story