ఉప్పొంగనున్న నది.. ఉద్రిక్త పరిస్థితల వేళ పాక్‌కు భారత్ వరద హెచ్చరిక.. కానీ

by Naga Rani Yarlagadda |

పహల్గామ్ లో ఉగ్రదాడి (Pahalgam Terror Attack), దానికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టడం, సింధుజలాల ఒప్పందం (Indus Water Treaty) అమలు నిలిచిపోవడం తర్వాత భారత్ - పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఉప్పొంగనున్న నది.. ఉద్రిక్త పరిస్థితల వేళ పాక్‌కు భారత్ వరద హెచ్చరిక.. కానీ
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గామ్ లో ఉగ్రదాడి (Pahalgam Terror Attack), దానికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టడం, సింధుజలాల ఒప్పందం (Indus Water Treaty) అమలు నిలిచిపోవడం తర్వాత భారత్ - పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలోనూ భారత్ పాక్ ను వరదలపై అప్రమత్తం చేసినట్లు సమాచారం. పాకిస్తాన్ లో భారీ వరదలు సంభవించే ఛాన్స్ ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని న్యూఢిల్లీ అలర్ట్ చేసినట్లుగా వార్తలు వినవస్తున్నాయి.

ఇప్పటికే కురుస్తోన్న భారీ వర్షాలకు జమ్ముకశ్మీర్లోని (Jammu&Kashmir) తావి నది ఉప్పొంగే అవకాశం ఉందని అంచనా వేసిన వాతావరణ శాఖ.. అదే జరిగితే పాక్ లోనూ వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించి మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంది భారత్. భారత్ హెచ్చరికలతో ఇస్లామాబాద్ లోని భారత్ హై కమిషన్ పాక్ అధికారులకు సమాచారం ఇచ్చిందని పాక్ మీడియాల్లో కథనాలు ప్రసారమయ్యాయి. అయితే దీనిపై భారత ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Next Story