Piyush Goyal: ప్రపంచ వాణిజ్య విధానాల్లో సంస్కరణలు తేవాలి- గోయల్

by Shamantha N |

ప్రపంచ వాణిజ్య విధానాల్లో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal) అన్నారు.

Piyush Goyal: ప్రపంచ వాణిజ్య విధానాల్లో సంస్కరణలు తేవాలి- గోయల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ వాణిజ్య విధానాల్లో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal) అన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ వాణిజ్యంలో చైనా ఆధిపత్యం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తంచేశారు. అన్యాయమైన వాణిజ్య పద్ధతులతో చైనా (China) ఆర్థికవృద్ధిని సాధిస్తోందని ఆరోపించారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనలను ఉల్లంఘించే కార్మిక పద్ధతులు బీజింగ్‌ వృద్ధికి కారణమన్నారు. ఇది భారత్ (India) వంటి ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే.. ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

రాహుల్ గాంధీపై ఆరోపణలు

అంతేకాకుండా, యూపీఏ సర్కారుపై గోయల్ పలు ఆరోపణలు చేశారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి కాలంలో భారత్‌- చైనాల మధ్య వాణిజ్య లోటు సాధారణంగానే ఉందన్నారు. అయితే, యూపీఏ హయాంలో అది 25 రెట్లు పెరిగిందని ఆరోపించారు. బీజింగ్‌లోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్‌ చైనాతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఆ తర్వాతే భారత్ లోకి వచ్చిన డ్రాగన్ ఉత్పత్తులపై పన్నులు తగ్గినట్లు పేర్కొన్నారు. దానివల్లే స్థానిక ఉత్పాదక రంగాలపై తీవ్ర ప్రభావం చూపించిందన్నారు. భారత్ పూర్తిగా చైనాపై ఆధారపడేలా చేసిందని గోయల్‌ పేర్కొన్నారు.

Next Story