India: పాక్ హైకమిషన్‌లో మరో అధికారిని బహిష్కరించిన భారత్

by S Gopi |

24 గంటల్లోగా భారత్‌ను విడిచి వెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

India: పాక్ హైకమిషన్‌లో మరో అధికారిని బహిష్కరించిన భారత్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న మరో అధికారి పనితీరుపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. తన అధికారిక హోదాకు అనుగుణంగా నడుచుకోవట్లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. సదరు అధికారిని బహిష్కరిస్తూ, 24 గంటల్లోగా భారత్‌ను విడిచి వెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది. మే 13న దేశంలో గూఢచర్యానికి పాల్పడుతున్నారనే ఆరోపణలతో హైకమిషన్‌లో పనిచేస్తున్న ఓ పాకిస్తాన్ అధికారిని బహిష్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అధికారి బహిష్కరణకు గురయ్యాడు. అయితే, దీనికి సంబంధించిన కారణాలను ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. దేశంలో తన అధికారిక హోదాకు సరిపోని కార్యకలాపాలకు పాల్పడినందుకు పర్సోనా నాన్ గ్రాటాగా భారత ప్రభుత్వం ప్రకటించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) వివరించింది. ఆ అధికారిని 24 గంటల్లోపు భారత్ విడిచి వెళ్లాలని కోరినట్లు పేర్కొంది. ఇదే సమయంలో, న్యూఢిల్లీలోని హైకమిషన్ అధికారులు భారత్‌లో పనిచేస్తున్న పాకిస్తాన్ దౌత్యవేత్తలు లేదా అధికారులు ఎవరైనా సరే తమ అధికారాలను, హోదాను ఏ విధంగానూ దుర్వినియోగం చేయకూడదని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది.

Next Story