PM Modi: సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ వరల్డ్ లీడర్‌గా ఎదుగుతోంది: ప్రధాని మోడీ

by S Gopi |

ఈ సందర్భంగా 1998 పోఖ్రాన్ అణు పరీక్షలను గుర్తుచేసుకున్నారు.

PM Modi: సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ వరల్డ్ లీడర్‌గా ఎదుగుతోంది: ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 1998 పోఖ్రాన్ అణు పరీక్షలను గుర్తుచేసుకున్నారు. భారత్ వివిధ సాంకేతిక అంశాల్లో వరల్డ్ లీడర్‌గా ఎదుగుతోందని అభిప్రాయపడ్డారు. భారత్ ఆపరేషన్ శక్తి కింద విజయవంతంగా అణు పరీక్షలు నిర్వహించిన మే 11, 1998 నాటి చిరస్మరణీయ సంఘటనలను జాతీయ సాంకేతిక దినోత్సవం గుర్తుచేస్తుందన్నారు. 'ఇది మన శాస్త్రవేత్తలకు ఇది గర్వకారణం. ఈ సందర్భంగా మన శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలియజేయాలి. మన దేశం వృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ముఖ్యంగా స్వావలంబన దిశగా పయనిస్తోందని' ప్రధాని మోడీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. భారత్ కీలకమైన అంతరిక్షం, ఏఐ, డిజిటల్ ఆవిష్కరణలు, గ్రీన్ టెక్నాలజీ వంటి అనేక సాంకేతిక అంశాల్లో వేగంగా ఎదుగుతోంది. భవిష్యత్తు తరాలను మరింత శక్తివంతం చేసేలా సైన్స్, పరిశోధనల్లో దేశ నిబద్ధత ప్రస్పుటమని మోడీ పేర్కొన్నారు. కాగా, 1998లో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో జరిగిన పోఖ్రాన్‌ అణు పరీక్ష విజయవంతమైన సందర్భంగా మన దేశంలో ఏటా మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవం నిర్వహిస్తారు. మనదేశ శాస్త్రవేత్తలు, పరిశోధకుల శాస్త్ర, సాంకేతిక విజయాలను గుర్తు చేసుకోవడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

Next Story