IND-PAK: పాకిస్థాన్ మిలిటరీకి భారత్ మరో షాక్..ఇదీ బ్రాండ్ అంటే!

by Ajay Maddhiboyina |

పాకిస్థాన్ ఆర్మీకి భారత్ మరో షాక్ ఇచ్చింది. పాక్ సరిహద్దుల్లో భారత్ అడ్వాన్స్డ్ జామింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసింది.

IND-PAK: పాకిస్థాన్ మిలిటరీకి భారత్ మరో షాక్..ఇదీ బ్రాండ్ అంటే!
X

దిశ‌, వెబ్ డెస్క్: పాకిస్థాన్ ఆర్మీకి భారత్(India) మరో షాక్ ఇచ్చింది. పాక్ సరిహద్దుల్లో భారత్ అడ్వాన్స్డ్ జామింగ్ సిస్టమ్( jammers) ఏర్పాటు చేసింది. మిలిటరీ ఎయిర్ క్ట్రాఫ్ట్స్‌కు సిగ్నల్ అందించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌ను ఇవి పనిచేయకుండా చేస్తాయి. పాక్ నేవీ దాడులకు పాల్పడకుండా సిగ్నల్స్‌ను ఇవి దెబ్బతీస్తాయి. ఎప్రిల్ 30 నుండి మే 23 వ‌ర‌కు పాక్ న‌డిపే అన్ని విమానాల‌ను భారత ఎయిర్‌స్పేస్‌లోకి నిషేదించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ జామింగ్ సిస్ట‌మ్‌తో యూఎస్ జీపీఎస్, రష్యా గ్లోనాస్, చైనా బీడౌ లాంటి నావిగేషన్ సిస్టమ్స్ కూడా పనిచేయకుండా చేయవచ్చని నిఘా వర్గాలు చెబుతున్నాయి. పాక్ వైమానిక దాడులకు పాల్పడకుండా జామింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను భారత్ సీరియస్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదులకు పాక్ ఆర్మీ సహకారం ఉందని తెలియడంతో భారత్ కన్నెర్ర చేసింది. ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేస్తామని ప్రకటించింది. పాక్‌కు సైతం బుద్ధి చెప్పి తీరతామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో భారత రక్షణ శాఖ అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలకు పాల్పడుతుంది.

Next Story