Rafale: 26 రఫేల్ యుద్ధవిమనాల కొనుగోలుకు రంగం సిద్ధం..!

by Shamantha N |

26 రఫేల్ యుద్ధ విమానాల కొనుగులోకు రంగం సిద్ధమైంది. ఫ్రాన్స్‌తో భారత్ బిగ్ డీల్ కుదుర్చుకుంది. రూ. 63,000 కోట్లతో 26 రాఫెల్-ఎం జెట్ల కొనుగోలుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదురినట్లు రక్షణ శాఖ సంబంధిత వర్గాలు తెలిపాయి.

Rafale: 26 రఫేల్ యుద్ధవిమనాల కొనుగోలుకు రంగం సిద్ధం..!
X

దిశ, నేషనల్ బ్యూరో: 26 రఫేల్ యుద్ధ విమానాల కొనుగులోకు రంగం సిద్ధమైంది. ఫ్రాన్స్‌తో భారత్ బిగ్ డీల్ కుదుర్చుకుంది. రూ. 63,000 కోట్లతో 26 రాఫెల్-ఎం జెట్ల కొనుగోలుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదురినట్లు రక్షణ శాఖ సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫ్రాన్స్‌తో భారత్ ఒక మెగా ఒప్పందం చేసుకుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రూ.63,000 కోట్లకు పైగా విలువైన ఒప్పందంపై త్వరలో సంతకాలు జరుగుతాయని వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల చివరిలో ఫ్రెంచ్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్ను భారతదేశాన్ని సందర్శించినున్నారు. ఈ సందర్భంగా ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. అయితే, ఫ్రాన్స్ నుంచి భారత నావికాదళం 22 సింగిల్-సీటర్ జెట్‌లతో పాటు నాలుగు ట్విన్-సీటర్ యుద్ధవిమానాలను పొందనుంది. అంతేకాకుండా, ఆఫ్‌సెట్ బాధ్యతల కింద ఫ్లీట్ నిర్వహణ, లాజిస్టికల్ సపోర్ట్, సిబ్బంది శిక్షణ, స్వదేశీ తయారీ భాగాల కోసం సమగ్ర ప్యాకేజీని అందుకుంటుంది. ఈ ఒప్పందంలో నేవీ సిబ్బందికి శిక్షణ కూడా ఉంది.

2023లోనే కొనుగోలుకు ఆమోదం

ఇకపోతే, 2023, జూలైలో రక్షణ మంత్రిత్వ శాఖ.. ఫ్రాన్స్ నుంచి రాఫెల్-ఎం జెట్‌ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. దేశీయంగా తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్‌తో కలిసి ఈ రాఫెల్ ఎం జెట్‌లు పని చేయనున్నాయి. ఒప్పందం తర్వాత 37 నుంచి 65 నెలల్లో రాఫెల్ విమానాలు డెలివరీ అవుతాయి. హిందూ మహాసముద్రంలో చైనా ఉనికి పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తం అయింది. ఈ యుద్ధ విమానాల రాకతో సముద్రంలో గస్తీ పెంచడానికి ఉపయోగపడతాయి. పొరుగువారి నుంచి ముప్పులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేందుకే ఈ విమానాలు కొనుగోలు చేస్తున్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి తెలిపారు.

Next Story