- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాసన సరోవర యాత్ర తిరిగి ప్రారంభం
చైనా-భారత్ సరిహిద్దులో ఉన్న మానస్ సరోవర్ యాత్రకు నేరుగా విమానాలు నడపడానికి ఇరు దేశాలు ప్రాథమికంగా అంగీకరించాయి.
- 2020లో నిలిచిపోయిన యాత్ర
- ఈ ఏడాదే తిరిగి పునఃప్రారంభం
- చైనా, భారత్ మధ్య కుదిరిన ఒప్పందం
దిశ, నేషనల్ బ్యూరో:
భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగు పడేలా ఇరు దేశాలు కీలకమైన ఒప్పందం చేసుకున్నాయి. 2020లో నిలిచిపోయిన మానస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు భారత్, చైనాల విదేశాంగ శాఖ కార్యదర్శులు విక్రమ్ మిస్రీ, వాంగ్ యీ ఒప్పందం కుదిరింది. చైనా-భారత్ సరిహిద్దులో ఉన్న మానస్ సరోవర్ యాత్రకు నేరుగా విమానాలు నడపడానికి ఇరు దేశాలు ప్రాథమికంగా అంగీకరించాయి.
'మానస సరోవర్ యాత్రను 2025 వేసవి కాలం నుంచి తిరిగి ప్రారంభించడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి. ఇప్పటికే ఉన్న ఒప్పందాలను అనుసరించి, యాత్రను జరిపే పద్దతులపై సంబంధిత యంత్రాంగం చర్చలు జరుపుతుంది. సరిహద్దు నదులకు సంబంధించిన నీటి వనరుల డేటా, ఇతర సహకారాలపై చైనా, భారత్‌కు చెందిన నిపుణుల బృందం ముందుగానే చర్చలు పునఃప్రారంభించడానికి అంగీకారాని వచ్చాయి' అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నిరుడు అక్టోబర్‌లో రష్యాలోని కఝాన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ, చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ మధ్య జరిగిన ఒప్పందాల నేపథ్యంలో విక్రమ్ మిస్రి బీజింగ్‌లో పర్యటించి వాటి పురోగతిపై చర్చలు జరిపారు. ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలు స్థిరీకరించి, వాటిని మెరుగుపరిచే విషయంలో కీలకమైన అడుగులు వేస్తున్నాయి. చైనా-ఇండియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 75 ఏళ్లు గడిచిన నేపథ్యంలో ఇదరు దేశాలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.






