యూఎస్‌తో చర్చలకు భారత్ సిద్ధమవుతోంది: పీటర్ నవారో

by Phanindra |

యూఎస్‌తో చర్చలకు భారత్ సిద్ధమవుతోందని యూఎస్ వాణిజ్య మంత్రి పీటర్ నవారో చెప్పారు. ఈ చర్చల కోసం యూఎస్ బృందం భారత్‌కు చేరుకుంది.

యూఎస్‌తో చర్చలకు భారత్ సిద్ధమవుతోంది: పీటర్ నవారో
X

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్‌తో వాణిజ్య చర్చలకు భారత్ సిద్ధమవుతోందని అమెరికా వాణిజ్య మంత్రి పీటర్ నవారో అన్నారు. భారత్‌పై యూఎస్ అదనపు సుంకాలు వేయడంతో ఈ చర్చలపై నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఇరుదేశాలు వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరపడం కీలకమైన పరిణామమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ విషయాన్ని భారత చీఫ్ నెగోషియేటర్, వాణిజ్య శాఖ ప్రత్యేక సెక్రెటరీ రాజేష్ అగర్వాల్ కూడా ధ్రువీకరించారు. ‘భారత్, అమెరికా రెండు దేశాలు వాణిజ్య చర్చలను వేగవంతం చేయనున్నాయి’ అని ఆయన చెప్పారు. దీని కోసం దక్షిణాసియాలో అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్.. ఒకరోజు పర్యటన కోసం మంగళవారం నాడు భారత్‌కు వస్తున్నట్లు ఆయన తెలిపారు.

Next Story