- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pahalgam attack: భారత్ కు రూ.250 కోట్ల విలువైన ఇగ్లా-ఎస్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్
పహెల్గామ్ దాడి తర్వాత పొరుగున ఉన్న పాకిస్థాన్‌తో ఉద్రిక్తలు పెరుగుతున్నాయి. ఈ ఉద్రిక్తతల మధ్య భారత సైన్యం వైమానిక రక్షణ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి డిఫెన్స్ క్షిపణులను కొనుగోలు చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గామ్ దాడి తర్వాత పొరుగున ఉన్న పాకిస్థాన్‌తో ఉద్రిక్తలు పెరుగుతున్నాయి. ఈ ఉద్రిక్తతల మధ్య భారత సైన్యం వైమానిక రక్షణ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి డిఫెన్స్ క్షిపణులను కొనుగోలు చేసింది. అత్యవసర అధికారాల కింద ఈ ఒప్పందం రష్యా- భారత్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగానే రూ. 250 కోట్లకు పైగా విలువైన రష్యన్ ఇగ్లా-ఎస్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణులను భారత్ అందుకుంది. ఈ క్షిపణులను ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కు సరఫరా చేశారు. శత్రు విమానాలు, డ్రోన్‌లు, హెలికాప్టర్ల దాడులను ఎదుర్కోవడానికి వీటిని మోహరిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ తో పశ్చిమ సరిహద్దులో భారత దళాల క్షిపణి సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా వీటిని భారత్ కొనుగోలు చేసింది.
ఇగ్లా ఎస్ క్షిపణులు..
వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ (VSHORADS)లో భాగమైన ఇగ్లా-ఎస్ క్షిపణులను కేంద్రం సాయుధ దళాలకు మంజూరు చేసిన అత్యవసర సేకరణ అధికారాలను ఉపయోగించి సంతకం చేసిన ఒప్పందం కిందే పంపిణీ చేశారు. ఈ వ్యవస్థలు భారత సైన్యం వైమానిక రక్షణ నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. ఇగ్లా-ఎస్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల కొత్త సామాగ్రిని భారత సైన్యం రెండు వారాల క్రితం అందుకున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, వైమానిక రక్షణ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి రష్యాతో ఈ తరహాలోనే మరో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఆ డీల్ కింద మిసైల్స్ కి సంబంధించిన అదనపు పరికరాలను అందుకోనుంది. ఇప్పుడు ఇగ్లా-ఎస్ క్షిపణుల డెలివరీలతో పాటు, ఫాస్ట్ ట్రాక్ విధానాల కింద మరో 48 లాంచర్లు, 90 క్షిపణులను కొనుగోలు చేయడానికి టెండర్ జారీ చేసిందని పేర్కొంది. అంతేకాకుండా, లేజర్ బీమ్-రైడింగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొత్త వెర్షన్లను కూడా త్వరలోనే పొందాలని బలగాలు చూస్తున్నాయి. ఇగ్లా-ఎస్ అనేది ఇగ్లా క్షిపణుల అధునాతన వెర్షన్. ఇది 1990ల నుండి వాడుకలో ఉంది.






