- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pakistan Defence Minister: పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసీఫ్ ఎక్స్ అకౌంట్ బ్లాక్
పహెల్గాం ఉగ్రదాడి తర్వాత్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై దౌత్యపరమైన కఠిన చర్యలను అమలు చేయాలని నిర్ణయించింది.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై దౌత్యపరమైన కఠిన చర్యలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇస్లామాబాద్‌పై పలు ఆంక్షలను విధించింది. ఇప్పుడు భారత్‌లో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఎక్స్ అకౌంట్ ని నిలిపివేసింది. జమ్ముకశ్మీర్‌పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో పాక్ రక్షణ మంత్రి (Pakistan Defence Minister) ఖవాజా అసీఫ్ (Khawaja Asif) ఎక్స్ ఖాతాను భారత్‌లో బ్లాక్ చేసింది. అంతకుముందు భారత్‌లో పాకిస్థాన్ ‘ఎక్స్’ ఖాతాను (Pakistan Governments X Account) కేంద్రం నిలిపివేసింది. ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ అకౌంట్‌ను యాక్సెస్ చేయకుండా నిలిపివేసింది. పలువురు పాకిస్థాన్ జర్నలిస్టులకు చెందిన ఎక్స్ ఖాతాలను కూడా నిషేధించింది. అంతేకాకుండా తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే, సున్నితమైన మతపరమైన అంశాల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయని ఆరోపిస్తూ కేంద్రం 16 పాకిస్థాన్ యూట్యూబ్ చానళ్లపై సోమవారం నిషేధం విధించింది.
ఆంక్షలు
ఏప్రిల్ 22న మధ్యాహ్నం జమ్ముకశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతమైన పహెల్గాం (Pahalgam)లో ఉగ్రవాదులు అమాయకులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. దీంతో, భారతప్రభుత్వం పాక్ పై ప్రతీకార చర్యలకు దిగింది. వీసాలు రద్దు, సింధు జలాల ఒప్పందం నిలిపివేత, ఔషధాల ఎగుమతి, పాకిస్థాన్ నటుల సినిమాలు బ్యాన్ చేసింది. పాక్ విమానాలకు (Pak airlines) భారత గగనతలం (Airspace) మూసివేత దిశగా కూడా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.






