- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తప్పుదారి పట్టించేలా వక్ఫ్ బిల్లుపై ఇండియా కూటమి తప్పుడు ప్రచారం: రాజీవ్ చంద్రశేఖర్
వక్ఫ్ సవరణ బిల్లు ఎవరికీ వ్యతిరేకం కాదు. ఇది ప్రజానుకూలమైనది, రాజ్యాంగపరమైన ఆస్తి సవరణ బిల్లు

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతిపక్ష ఇండియా కూటమిపై కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వర్గాన్ని తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో ఇండియా కూటమి తప్పుడు సమాచాన్ని ప్రచారం చేస్తోందని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన అన్నారు. ఈ బిల్లు ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కును పరిరక్షించే లక్ష్యం దీని ఉద్దేశమని తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లు ఎవరికీ వ్యతిరేకం కాదు. ఇది ప్రజానుకూలమైనది, రాజ్యాంగపరమైన ఆస్తి సవరణ బిల్లు. రాహుల్ గాంధీ లేదా ఓవైసీ ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్నవారివి పూర్తిగా అబద్దలు. తప్పుడు సమాచారం ఆధారంగానే వారి వ్యాఖ్యలున్నాయి. కేరళలో వక్ఫ్ అధికారుల ఏకపక్ష భూకబ్జాల కారణంగా అనేక కుటుంబాలు నష్టపోయాయి. కేరళలోనే కాదు, కొచ్చి వెలుపల మునంబమ్‌లో వందలాది కుటుంబాలు బాధితులుగా ఉన్నాయి. వారి భూమి, ఆస్తులను వక్ఫ్ ఏకపక్షంగా లాక్కుంటోంది. వక్ఫ్ సవరణ చట్టం ప్రజల ఆస్తులను వేరెవరూ లాక్కోకుండా కాపాడుతుందని రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.






