- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏడాది తర్వాత ఇండియా కూటమి నేతల భేటీ
by Phanindra |
ఏడాది తర్వాత ఇండియా కూటమి నేతల భేటీ జరగనుంది. రాహుల్ గాంధీ నివాసంలో ఈ లీడర్స్ నేరుగా కలవనున్నారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: ఏడాది తర్వాత ప్రతిపక్ష ఇండియా కూటమి సమావేశం జరగనుంది. గతేడాది జూన్ 1న లోక్‌సభ ఫలితాలకు మూడ్రోజుల ముందు చివరిగా ఇండియా కూటమి నేతలు ఒకేచోట కలిశారు. ఆ తర్వాత ఒకటి, రెండుసార్లు వర్చువల్‌గా సమావేశాలు నిర్వహించారే తప్ప.. నేరుగా కలిసింది లేదు.
ప్రస్తుతం బిహార్‌లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలంతా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై కార్యాచరణను నిర్ణయించేందుకే లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాసంలో గురువారం నాడు ఇండియా కూటమి నేతలు కలవాలని నిర్ణయించుకున్నారు.
ఆ మరుసటి రోజు ఢిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి ఇండియా కూటమి నేతలు మార్చ్ చేయనున్నారు. దీంతో ఎస్ఐఆర్ అంశం విపక్షాలను ఏకం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Next Story






