త్వరలోనే యూఎస్ ట్రేడ్ డీల్‌పై ప్రకటన.. మార్చిలో సంతకాలు!

by Phanindra |

త్వరలోనే యూఎస్ ట్రేడ్ డీల్‌పై ప్రకటన ఉండొచ్చు. మార్చిలో ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని గోయల్ చెప్పారు.

త్వరలోనే యూఎస్ ట్రేడ్ డీల్‌పై ప్రకటన.. మార్చిలో సంతకాలు!
X

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్ ప్రెసిడెంట్ భారత్‌తో ట్రేడ్ డీల్ పూర్తయినట్లు ప్రకటించినప్పటికీ.. ఈ డీల్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం. ఇది పూర్తయిన తర్వాత నాలుగైదు రోజుల్లో ఇరుదేశ ప్రభుత్వాలు ఈ ఒప్పందంపై ప్రకటన చేస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోడీ స్పందించిన పోస్టులో ఎక్కడా అమెరికాతో డీల్‌ను ప్రస్తావించలేదు. దీనిపై విపక్షాల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం నుంచి సీనియర్ అధికారులు.. వచ్చే వారం భారత్‌కు వచ్చి డీల్ పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్రేడ్ డీల్‌పై మార్చి మధ్యలో సంతకాలు జరుగుతాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.

‘ఇరుదేశాలు ఉమ్మడిగా ప్రకటన విడుదల చేసిన తర్వాత.. అమెరికా ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో భారత్‌పై సుంకాలను 18 శాతానికి తగ్గిస్తుంది’ అని ఆయన వెల్లడించారు. అయితే ఈ డీల్‌తో అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత మార్కెట్లో సుంకాలు లేకుండా వస్తాయని, దీని వల్ల స్థానిక రైతులు నష్టాలు ఎదుర్కొంటారని విమర్శలు వస్తున్నాయి. అయితే వ్యవసాయం, డెయిరీ, ఫిషరీస్ రంగాలకు పూర్తి రక్షణ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు హామీ ఇస్తున్నాయి.

Next Story