- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాక్‌తో అణుస్థావరాల వివరాలు పంచుకున్న భారత్
పాక్‌తో అణుస్థావరాల వివరాలు పంచుకున్న భారత్. 1988లో చేసుకున్న ఒప్పందం ప్రకారమే అన్న విదేశాంగ శాఖ.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాకిస్తాన్ తమ తమ దేశాల్లో ఉన్న న్యూక్లియర్ వ్యవస్థల వివరాలను పంచుకున్నాయి. 1988 డిసెంబరు 31న ఈ రెండు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారమే ఈ వివరాలను ఇరుదేశాలు షేర్ చేసుకున్నాయి. ఈ ఒప్పందం 1991 జనవరి నుంచి అమల్లోకి వచ్చినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ వెల్లడించారు. తమ దేశాల్లోని అణుస్థావరాలపై పొరుగు దేశం దాడులు చేయకూడదనే ఉద్దేశ్యంతోనే రెండు దేశాలు ఈ ఒప్పందం చేసుకున్నాయి. అలాగే 2008 మే 21వ తేదీన చేసుకున్న మరో ఒప్పందం ప్రకారం, తమ వద్ద ఉన్న పొరుగు దేశపు ఖైదీల వివరాలను కూడా రెండు దేశాలు పంచుకున్నాయి.
గతేడాది మే నెలలో పహెల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ సంబంధాలు బాగా చెడిపోయిన సంగతి తెలిసిందే. అయినా సరే ఈ వివరాలను ఒప్పందం ప్రకారం పంచుకున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ వెల్లడించారు. అలాగే పాక్‌లో ఉన్న 257 మంది భారతీయ ఖైదీల వివరాలను పాక్ తమకు తెలియజేసిందని, వీరిలో 199 మంది జాలరులుండగా, 58 మంది సివిలియన్స్ ఉన్నారని తాహిర్ తెలిపారు. ఏటా జనవరి, జులై నెలల్లో రెండుసార్లు ఇరుదేశాలు ఖైదీల వివరాలను ఎక్స్‌చేంజ్ చేసుకుంటాయని చెప్పారు. అలాగే న్యూక్లియర్ సదుపాయాల గురించి ప్రతియేడూ జనవరి ఒకటో తేదీన వివరాలు ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటాయని వివరించారు.






