- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలోనే ఒమన్-భారత్ మధ్య ట్రేడ్ డీల్.. చర్చలు సఫలం.. ఇక సంతకాలే?
by Phanindra |
త్వరలోనే ఒమన్-భారత్ మధ్య ట్రేడ్ డీల్ కుదురుతుందని, ఇప్పటికే చర్చలు సఫలమయ్యాయని ఒమన్ రాయబారి తెలిపారు. త్వరలోనే సంతకాలు చేసుకుంటామన్నారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: భారత్, ఒమన్ మధ్య త్వరలోనే ట్రేడ్ డీల్ జరనుందని భారత్‌లో ఒమన్ అంబాసిడర్ ఇస్సా సాలే అబ్దుల్లా సాలే ఆల్‌షిబానీ అన్నారు. ఈ రెండు దేశాల మధ్య కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ అగ్రిమెంట్ (సెపా) ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంపై చర్చలన్నీ ముగిశాయని, ప్రస్తుతం లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియ జరుగుతోందని ఒమన్ రాయబారీ తెలిపారు. చాలా త్వరలోనే ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. 2023 నవంబరు నుంచి సెపా కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ డీల్ కుదిరితే ఈ దేశాలు తమ వాణిజ్య భాగస్వామి నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీనీ చాలావరకు తగ్గించుకుంటాయి. కొన్ని ఉత్పత్తులపై పూర్తిగా కస్టమ్స్ డ్యూటీని రద్దు చేసుకుంటాయి కూడా.
Next Story






