- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ స్టేటస్ పొడిగింపు.. భారత్-ఈయూ డీల్‌లో కీలక నిర్ణయం
by Phanindra |
‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ స్టేటస్ పొడిగించాలని భారత్-ఈయూ డీల్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ముసాయిదాను శుక్రవారం విడుదల చేశారు. దీని ప్రకారం, డీల్ కుదిరిన తర్వాత ఐదేళ్లపాటు ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ స్టేటస్‌ను పొడిగించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. దీంతో వాణిజ్య పరమైన అంశాల్లో ఇరుదేశాలు ఒకదానికొకటి ప్రాధాన్యత ఇచ్చుకుంటాయి. కాగా, జనవరి 27న ప్రధాని మోడీ, ఈయూ నేతలు ఉర్సులా వోన్ డర్ లీయన్, ఆంటోనియో కోస్టాల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం ఇండియా-ఈయూ డీల్‌పై చర్చలు ముగిశాయి. ఈ డీల్‌తో భారత్ నుంచి యూరప్ వెళ్లే 93 శాతం ఉత్పత్తులపై ఎలాంటి సుంకాలు ఉండవు. అలాగే దీంతో 200 కోట్ల మంది ప్రజల మార్కెట్ తయారవుతుందని భారత్, ఈయూ ప్రకటనలు చేశాయి.
Next Story






