- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాసేపట్లో ఇండియా కూటమి నేతల భేటీ.. ఉప రాష్ట్రపతి రాజీనామాపై చర్చ
పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఇవాళ కాసేపట్లో ఇండియా (India) కూటమి నేతలు సమావేశం కానున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఇవాళ కాసేపట్లో ఇండియా (India) కూటమి నేతలు సమావేశం కానున్నారు. ఈ భేటీని మల్లికార్జున్ ఖర్గే (Mallkarjun Kharge) కార్యాలయంలో నిర్వహించనున్నారు. అయితే, తొలి రోజే పహల్గాం, ఆపరేషన్ సిందూర్ అంశాలపై విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో గందరగోళం నెలకొనడంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇండియా కూటమి నేతలంతా చర్చించనున్నారు. అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై వ్యూహాలు రచించనున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhad) రాజీనామా, తదనంతర పరిణామాలపై చర్చించనున్నారు. మరోవైపు ఇండియా కూటమి నుంచి ఆమ్‌ఆద్మీ పార్టీ వైదొలిగింది. నేటి సమావేశానికి ఆప్ మినహా మిగతా భాగస్వామ్య పక్షాలు మీటింగ్ హాజరుకానున్నారు.






