- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gaza: గాజా సీజ్‌ఫైర్ తీర్మానంపై ఒటింగ్‌కు దూరంగా ఉన్న భారత్
ఈ తీర్మానంలో కాల్పుల విరమణతో పాటు హమాస్, ఇతర బందీలను వెంటనే, బేషరతుగా విడుదల చేయాలనే డిమాండ్ ఉంది.

దిశ, నేషనల్ బ్యూరో: గాజాలో 'తక్షణ, షరతుల్లేని, శాశ్వత' కాల్పుల విరమణను డిమాండ్ చేసే ముసాయిదా తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. యూఎన్ జనరల్ అసెంబ్లీలో జరిగిన ఈ తీర్మానాన్ని స్పెయిన్ ప్రవేశపెట్టింది. అత్యధిక ఓట్లు వచ్చిన ఈ తీర్మానంలో కాల్పుల విరమణతో పాటు హమాస్, ఇతర బందీలను వెంటనే, బేషరతుగా విడుదల చేయాలనే డిమాండ్ ఉంది. గైర్హాజరైన 19 దేశాలలో భారత్ కూడా ఉంది. 12 దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. అనుకూలంగా 149 ఓట్లు వచ్చాయి. గైర్హాజరైన దేశాలలో అల్బేనియా, కామెరూన్, ఈక్వెడార్, ఇథియోపియా, మలావి, పనామా, దక్షిణ సూడాన్, టోగో ఉన్నాయి. 'పౌరుల రక్షణ, చట్టపరమైన, మానవతా బాధ్యతలను సమర్థించడం' అనే తీర్మానంపై ఓటింగ్‌కు వివరణ ఇస్తూ, గాజాలో మానవత్వం దిగజారుతున్న నేపథ్యంలో ఈ తీర్మానం వచ్చిందని యూఎన్‌లో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ అన్నారు. తీవ్రమవుతున్న సంక్షోభం పట్ల భారత్ తీవ్ర ఆందోళన చెందుతోంది, పౌరుల ప్రాణనష్టాన్ని ఖండిస్తున్నట్లు ఆయన అన్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై కూడా భారత్ గతంలో తీర్మానాలకు దూరంగా ఉందని హరీష్ పేర్కొన్నారు. చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే వివాదాలను పరిష్కరించగలమనే నమ్మకంతో ఉన్నాం. రెండు దేశాలను చేరువ చేసేందుకు ఉమ్మడి ప్రయత్నం చేయాలి. ఈ కారణాల వల్ల, మేము ఈ తీర్మానానికి దూరంగా ఉండాలని నిర్ణయించామని ఆయన వెల్లడించారు. కాగా, ఇజ్రాయెల్ దిగ్బంధనను వెంటనే తొలగించాలని, అన్ని సరిహద్దు క్రాసింగ్‌లను తెరవాలని, అంతర్జాతీయ చట్టం, మానవతను దృష్టిలో ఉంచుకుని బాధ్యతలకు అనుగుణంగా, గాజా స్ట్రిప్ అంతటా పాలస్తీనా ప్రజలకు వెంటనే సహాయం అందించాలని స్పెయిన్ తన తీర్మానంలో డిమాండ్ చేసింది.






