Sharad kapoor : మహిళతో అసభ్య ప్రవర్తన.. బాలీవుడ్ నటుడిపై కేసు నమోదు

by Sathputhe Rajesh |

బాలీవుడ్ నటుడు శరద్ కపూర్‌పై ముంబాయి పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.

Sharad kapoor : మహిళతో అసభ్య ప్రవర్తన.. బాలీవుడ్ నటుడిపై కేసు నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో : బాలీవుడ్ నటుడు శరద్ కపూర్‌పై ముంబాయి పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద సదరు నటుడిపై కేసు నమోదు చేయడంతో పాటు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి. బాధిత మహిళ(32) తెలిపిన వివరాల ప్రకారం.. ‘సోషల్ మీడియాలో శరద్ కపూర్ పరిచయమయ్యాడు. తరచూ వీడియో కాల్స్ మాట్లాడుకునే వాళ్లం. అయితే ఓ లోకేషన్ పంపి సినిమా షూట్ కోసం తనను కలవాలని కోరాడు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత అది షూటింగ్ లొకేషన్ కాదని నటుడి ఇళ్లుగా గుర్తించాను. తాను ఇంటికి వెళ్లే సరికి శరద్ కపూర్ లో దుస్తువులపై ఉన్నాడు. పడక గదిలోకి పిలిచి తనను బల‌వంతంగా తాకాడు. భయంతో అక్కడి నుంచి వెళ్లిపోగా వాట్సాప్‌లో తరచూ అసభ్య పదజాలంతో మెసెజ్‌లు పంపుతున్నాడు.’ అని తెలిపింది. వెంటనే నటుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. 2001లో షారూఖ్ ఖాన్ నటించిన జోష్ సినిమాకు గాను శరద్ కపూర్ బెస్ట్ విలన్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. తాజాగా 2022లో ‘నో మీన్స్ నో’, ‘ది గుడ్ మహారాజా’ సినిమాల్లో శరద్ కపూర్ నటించారు.

Next Story