IND Vs PAK: పాకిస్థాన్‌ దిగుమతులపై భారత్ నిషేధం.. దాయాది వక్ర బుద్ధి

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-05 04:03:22  IST  )

పహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack) నేపథ్యంలో భారత్‌ (India), పాకిస్థాన్‌ (Pakistan) మధ్య వాతావారణం నెలకొన్న వేళ పాక్ నుంచి వచ్చే అన్ని వస్తువుల దిగుమతులపై భారత్‌ నిషేధం విధించింది.

IND Vs PAK: పాకిస్థాన్‌ దిగుమతులపై భారత్ నిషేధం.. దాయాది వక్ర బుద్ధి
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack) నేపథ్యంలో భారత్‌ (India), పాకిస్థాన్‌ (Pakistan) మధ్య వాతావారణం నెలకొన్న వేళ పాక్ నుంచి వచ్చే అన్ని వస్తువుల దిగుమతులపై భారత్‌ నిషేధం విధించింది. ఈ మేరకు విదేశీ వాణిజ్య డైరెక్టరేట్‌ జనరల్‌ (DGFT) మే 2న నోటిఫికేషన్‌ జారీ చేసింది. దిగుమతులపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. పాకిస్థాన్‌ నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎగుమతి అయ్యే అన్ని వస్తువులపై నిషేధం విధిస్తూ విదేశీ వాణిజ్య విధానం (FTP)లో ఓ నిబంధన చేర్చినట్లు ఆ నోటిఫికేషన్‌‌లో పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వుల వెలువడే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. జాతీయ భద్రత, ప్రభుత్వ విధానం ప్రయోజనాల కోసం పాకిస్థాన్‌ నుంచి లేదా ఆ దేశం మీదుగా వచ్చే అన్ని వస్తువులపై దిగుమతి నిషేధం విధించామని క్లారిటీ ఇచ్చారు. ఆంక్షలకు ఎలాంటి మినహాయింపులైనా భారత ప్రభుత్వం (Indian Government) నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అంటూ విదేశీ వాణిజ్య డైరెక్టరేట్‌ జనరల్‌ (DGFT) స్పష్టం చేసింది.

ఈ క్రమంలోనే పాక్ తన కుఠిల ప్రయత్నాలకు తెర లేపింది. తమ దేశ దిగుమతులను మరో దేశం మీదుగా భారత్‌లోకి పంపేందుకు అడ్డదారులను వెతుకుతోంది. యూఏఈ (UAE), సింగపూర్‌ (Singapore), ఇండోనేషియా (Indonesia), శ్రీలంక (శ్రీలంక)నుంచి తమ దిగుమతులను భారత్‌లోకి పంపించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ క్రమంలోనే పాక్ దిగుమతులను దేశంలోకి రానివ్వకుండా అడ్డుకునేందు DGFT తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దేశ వ్యాప్తంగా అన్ని ఓరరేవులు, ఎయిర్‌పోర్టులలో కస్టమ్స్ అధికారులు అప్రమత్తం చేసింది.

Next Story