T20 World Cup: టాస్ గెలిచిన నమీబియా.. భారత్ ఫస్ట్ బ్యాటింగ్

by Prasad Jukanti |

ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్- నమీబియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో నమీబియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది.

T20 World Cup: టాస్ గెలిచిన నమీబియా.. భారత్ ఫస్ట్ బ్యాటింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీ20 వరల్డ్‌కప్‌ (ICC Mens T20 World Cup) 2026లో భాగంగా ఇవాళ భారత్-నమీబియా తలపడుతున్నాయి. ఢిల్లీ వేదికగా ఇవాళ సాయం 7 గంటలకు ఇరు జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‍లో నమీబియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్‍కు దిగనుంది. ఈ మ్యాచ్‍లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న అభిషేక్ శర్మ స్థానంలో సంజు శాంసన్ ఓపెనర్‍గా జట్టులోకి వచ్చారు. ఇక జర్వం కారణంగా యూఎస్ఏతో మ్యాచ్‍కు దూరంగా ఉన్న బుమ్రా సైతం ఈ మ్యాచ్‍లో ఆడుతున్నాడు.

భారత్ తుది జట్టు:

సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, రింకు సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.

నమీబియా జట్టు:

గెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జేన్ గ్రీన్ (వికెట్ కీపర్), లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్, జె.జె. స్మిత్, రూబెన్ ట్రంపెల్మాన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, మాక్స్ హీంగో, మలన్ క్రుగర్, బెన్ షికోంగో

Next Story