IND PAK War: భారత్‌తో యుద్ధంపై పాక్ మాజీ హైకమిషనర్ సంచలన ట్వీట్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-06 07:18:40  IST  )

పాకిస్థాన్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ సంచలన ట్వీట్ చేశారు. రష్యా విక్టరీ డే తర్వాత భారత్.. పాకిస్థాన్ పై దాడి చేసే అవకాశం ఉందని అందులో రాసుకొచ్చారు.

IND  PAK War: భారత్‌తో యుద్ధంపై పాక్ మాజీ హైకమిషనర్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ - పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పాక్ పై యుద్ధం చేసేందుకు భారత్ సరైన సమయం కోసం ఎదురుచూస్తుందని ఇప్పటికే కొన్ని వర్గాలు వెల్లడించాయి. అందుకు తగ్గట్టుగానే దేశమంతా రేపు మాక్ డ్రిల్స్ నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ సిద్ధమైంది. ఈ క్రమం పాకిస్థాన్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ సంచలన ట్వీట్ చేశారు.

రష్యా విక్టరీ డే తర్వాత భారత్.. పాకిస్థాన్ పై దాడి చేసే అవకాశం ఉందని అందులో రాసుకొచ్చారు. మే9న రష్యా విక్టరీ డే వేడుకలు జరగనున్నాయి. ఆ మర్నాడే.. అంటే మే 10, 11 తేదీల్లో భారత్ తమ దేశంపై దాడి చేయవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత్ ఏ క్షణాన్నైనా దాడి చేయవచ్చని భావిస్తున్న పాక్.. క్షిపణులతో సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ అత్యున్నత వర్గాలు సైతం ఈ వారాంతంలోగా ఎప్పుడైనా పాక్ పై భారీ స్థాయి ఆపరేషన్ జరగవచ్చని చెబుతున్నాయి.

Next Story