ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్.. పెరిగిన పర్సంటేజ్

by Gantepaka Srikanth |

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections) పోలింగ్ ప్రక్రియ ముగిసింది.

ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్.. పెరిగిన పర్సంటేజ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections) పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ.. సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58 శాతం నమోదైంది. గతంతో పోలిస్తే ఇది ఎక్కువ(Increased Polling Percentage). ప్రస్తుతం ఆరు గంటల తర్వాత ముగిసినా క్యూ లైన్లలో ఉన్న వారికి అనుమతి ఇస్తున్నారు. దీంతో పోలింగ్ పర్సంటేజ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను అధికార ఆప్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ఈసారి ఎలాగైనా జెండా పాతాలని మూడు పార్టీలు కాస్త గట్టిగానే ప్రయత్నం చేశాయి. కేజ్రీవాల్‌ హ్యాట్రిక్‌ కొడతారా? లేక బీజేపీ(BJP) విజయదుందుభి మోగిస్తుందా? కాంగ్రెస్ సత్తా చూపిస్తుందా? అని దేశమంతా ఎదురుచూస్తోంది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ సీట్లకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల ఫలితాలను ఫిబ్రవరి 8న ప్రకటించనున్నారు. ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందుకు గానూ 13 వేల 766 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వాటిలో 3 వేలకు పోలింగ్‌ సెంటర్లను సమస్యాత్మకమైవనిగా గుర్తించి అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘాను పెంచారు.

Next Story