- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
INC: వందల ఎలుకలు తిన్న పిల్లి హజ్‌కి వెళ్ళిందట!.. బడ్జెట్ పై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
తొమ్మిది వందల ఎలుకలను తిన్న తరువాత, పిల్లి హజ్‌కి వెళ్ళింది! అనే సామెత ఈ బడ్జెట్‌కు సరిగ్గా సరిపోతుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు (Congress Chief) మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: తొమ్మిది వందల ఎలుకలను తిన్న తరువాత, పిల్లి హజ్‌కి వెళ్ళింది! అనే సామెత ఈ బడ్జెట్‌కు సరిగ్గా సరిపోతుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు (Congress Chief) మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) అన్నారు. శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్(Union Moinister Nirnala sitharaman) ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. బీజేపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై ఆయన.. గత 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం(Modi Government) మధ్యతరగతి ప్రజల నుండి రూ.54.18 లక్షల కోట్ల ఆదాయపు పన్ను వసూలు చేసి, ఇప్పుడు 12 లక్షల వరకు మినహాయింపు ఇస్తున్నారని మండిపడ్డారు. దాని ప్రకారం సంవత్సరానికి రూ.80,000 ఆదా అవుతుందని, అంటే నెలకు రూ. 6,666 మాత్రమే! అని ఆర్థిక మంత్రి(Finance Minister) స్వయంగా చెబుతున్నారని విమర్శించారు.
దేశం మొత్తం ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యతో పోరాడుతుంటే, మోడీ ప్రభుత్వం మాత్రం తప్పుడు ప్రశంసలు పొందడంపైనే శ్రద్ధ కనబరుస్తోందని ఎద్దేవా చేశారు. ఈ "ప్రకటన-మేకింగ్" బడ్జెట్‌లో, మేక్ ఇన్ ఇండియా(Make In India) దాని లోపాలను దాచడానికి నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్(Manufacturing Mission)గా చేయబడిందని, మిగతా ప్రకటనలన్నీ దాదాపు ఇలాగే ఉన్నాయని ఆరోపించారు. ఇక యువతకు ఏమీ లేదని, ఈ బడ్జెట్‌లో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తానని మోడీ నిన్న హామీ ఇచ్చారు కానీ బడ్జెట్‌లో అలాంటిదేమీ జరగలేదని చెప్పారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి రోడ్‌మ్యాప్ లేదని, వ్యవసాయ ఇన్‌పుట్‌లపై జీఎస్టీ రేట్లలో రాయితీ లేదని అన్నారు. దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల, పేద, మైనారిటీ పిల్లలకు ఆరోగ్యం, విద్య, స్కాలర్‌షిప్ కోసం ఎటువంటి ప్రణాళిక లేదని, ప్రైవేట్ పెట్టుబడులను పెంచేందుకు ఎలాంటి సంస్కరణ చర్యలు లేవని ఆరోపించారు.
ఎగుమతి, టారిఫ్‌లపై కొన్ని పైన విషయాలు చెప్పడం ద్వారా వారి వైఫల్యాలు దాచబడ్డాయని, పేదల ఆదాయాన్ని పెంచేందుకు ఏమీ చేయలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక నిరంతరం పడిపోతున్న వినియోగాన్ని పరిష్కరించేందుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని, ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతున్నప్పటికీ, ఎంజీఎన్ఆర్ఈజీఏ (MGNREGA) బడ్జెట్ అలాగే ఉందని, కార్మికుల ఆదాయాన్ని పెంచేందుకు ఏమీ చేయలేదని మండిపడ్డారు. GST యొక్క బహుళ రేట్లలో ఎటువంటి సంస్కరణ ప్రస్తావన లేదని, నిరుద్యోగాన్ని తగ్గించడానికి, ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడలేదని, స్టార్టప్ ఇండియా(Startup India), స్టాండప్ ఇండియా(Stand Up India), స్కిల్ ఇండియా(Skill India) పథకాలన్నీ కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యాయని దుయ్యబట్టారు. ఇక మొత్తంమీద ఈ 2025 బడ్జెట్ ప్రజలను మోసం చేయడానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అని ఖర్గే వ్యాఖ్యానించారు.






