ప్రధాని మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. పోలీసుల అదుపులో నిందితుడు

by Kema Shiva Kumar |

బీహార్ (Bihar) ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.

ప్రధాని మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. పోలీసుల అదుపులో నిందితుడు
X

దిశ, వెబ్‌డెస్క్: బీహార్ (Bihar) ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister) తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లో్కి వెళితే.. దర్భంగాలో కాంగ్రెస్ (Congress), ఆర్జేడీ (RJD) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో రిజ్వీ (Rizvi) అలియాస్ రాజా (Raja) అనే వ్యక్తి ప్రధానితో పాటు ఆయన తల్లి హీరాబెన్ మోడీపై అనుచితన వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన ట్వీట్ చేశారు. దర్భంగాలో ‘ఓటర్ అధికార్ యాత్ర’ సందర్భంగా విపక్ష పార్టీల బహిరంగ సభ వేదిక నుంచి గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన దివంగత తల్లి హీరాబెన్ మోడీ (Heeraben Modi)పై ఉపయోగించిన అగౌరవ భాష అత్యంత అనుచితమైనది, నేను దానిని తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ నితీశ్ కుమార్ రాసుకొచ్చారు. ఈ క్రమంలోనే వైరల్ అయిన అనుచిత వ్యాఖ్యల వీడియో ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఎస్పీ ఆదేశాల మేరకు నిందితుడు రిజ్వీ అలియాస్ రాజాను పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు.

Next Story