- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వర్షాల నేపథ్యంలో.. కేంద్రం కీలక నిర్ణయం!
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో.. ప్రాణ నష్టం లేకుండా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు ఆదేశాలు జారీ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో.. ప్రాణ నష్టం లేకుండా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ రోజు ఉదయమే హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణలో భారీ వర్షాలు, వరదల వలన ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పరిస్థితి గురించి.. కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఈ విధంగా స్పందించి తెలంగాణకు అవసరమైన ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నట్లు తెలిపారు. దాంట్లో భాగంగానే చెన్నై, వైజాగ్, అసోం నుండి 3 చొప్పున మొత్తం 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తెలంగాణకు పంపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
అనంతరం, ఇదే విషయాన్ని గురించి బండి సంజయ్.. తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. తెలంగాణకు అదనంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపినట్లు తెలిపారు. అదే సమయంలో ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులతో మాట్లాడిన బండి సంజయ్.. రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని వారికి సూచించారు.






