ఆ రాష్ట్రంలో మద్యం ఎక్కువగా తాగడంలో మహిళలే టాప్.. సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి!

by Jakkula.Mamatha |

ప్రస్తుత కాలంలో మద్యం సేవించే వారి సంఖ్య పెరుగుతుందనే చెప్పవచ్చు.

ఆ రాష్ట్రంలో మద్యం ఎక్కువగా తాగడంలో మహిళలే టాప్.. సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి!
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో మద్యం సేవించే వారి సంఖ్య పెరుగుతుందనే చెప్పవచ్చు. పలు సర్వేల ఆధారంగా కూడా మద్యం అమ్మకాల్లో టాప్‌లో ఉన్న రాష్ట్రాల గురించి వినే ఉంటారు. అయితే.. సాధారణంగా మద్యం(alcohol) తాగే అలవాటు పురుషులకే ఎక్కువగా ఉంటుందని అందరూ భావిస్తారు. వాస్తవానికి అది నిజమే.. ఒకప్పుడు పురుషులకు మాత్రమే ఎక్కువగా మద్యం సేవించే అలవాటు ఉండేది.

కానీ.. ప్రస్తుతం జీవన శైలి మారిపోయింది. ఆడ, మగ అనే తేడా లేకుండా మద్యం సేవిస్తున్నారు. ఆడవాళ్లలో కూడా మద్యం తాగే అలవాటు ఉన్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో దేశంలో ఏ రాష్ట్రంలో మద్యం తాగే మహిళలు అధికంగా ఉన్నారు? అనే విషయంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల సర్వే నిర్వహించింది. ఆ సర్వే వెల్లడించిన విషయం గురించి తెలుసుకుందాం. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ(Union Ministry of Health and Family Welfare) ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మహిళలు మద్యం ఎక్కువగా సేవించే రాష్ట్రాల్లో అస్సోం ముందంజలో ఉంది.

సర్వే ప్రకారం.. ఈ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఈశాన్య రాష్ట్రాలే ఉన్నాయి. అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాల్లో అస్సాం(Assam) మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత వరుసగా మేఘాలయ(Meghalaya), అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) ఉన్నాయి. దేశవ్యాప్తంగా 15-49 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో సగటు మద్యపానం 1.2 శాతం ఉంది. అస్సాంలో ఇది 16.5 శాతం, మేఘాలయలో 8.7 శాతంగా ఉందని సర్వేలో వెల్లడైంది. ఆ తర్వాత సిక్కిం(Sikkim)(0.3 శాతం) , ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) (0.2 శాతం) ఉన్నాయి. అయితే.. సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం గతంతో పోల్చుకుంటే ఈ సారి వీళ్ల సంఖ్య కాస్త తగ్గినట్లు తెలుస్తోంది.

Next Story