పరువు నష్టం కేసులో ఢిల్లీ సీఎం ఆతిషికి ఊరట

by Ajay Maddhiboyina |   (  Updated:2025-01-28 14:06:54  IST  )

ఈ వ్యాఖ్యలపై బీజేపీకి చెందిన ప్రవీణ్ శంకర్ కపూర్ పరువు నష్టం దావా వేశారు. ఆ

పరువు నష్టం కేసులో ఢిల్లీ సీఎం ఆతిషికి ఊరట
X

- బీజేపీలో జాయిన్ కాకపోతే ఈడీ కేసులు పెడతామన్నారని వ్యాఖ్యలు

- ఆతిషిపై డిఫామేషన్ కేసు వేసిన బీజేపీ నాయకుడు

- కేసు కొట్టేసిన ఢిల్లీ కోర్టు

దిశ, నేషనల్ బ్యూరో:

ఢిల్లీ సీఎం ఆతిషిపై బీజేపీ నాయకుడు వేసిన పరువు నష్టం దావా కేసును ఢిల్లీ హైకోర్టు మంగళవారం కొట్టేసింది. నిరుడు ఏప్రిల్‌లో కొంత మంది బీజేపీకి చెందిన నాయకులు తనను, కొందరు ఆప్ నాయకులను కలిసి వాళ్ల పార్టీలో చేరాలని ఒత్తిడి చేశారని, అలా చేరకుంటే ఈడీ కేసులు పెట్టి నెలలోపు అరెస్టు చేయిస్తామని హెచ్చరించినట్లు ఆతిషి వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఆమె కేజ్రివాల్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలపై బీజేపీకి చెందిన ప్రవీణ్ శంకర్ కపూర్ పరువు నష్టం దావా వేశారు. ఆతిషితో పాటు ఆప్ నాయకులు చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని, వారి వ్యాఖ్యలను సమర్థించే ఏ రుజువును కూడా వారు దాఖలు చేయలేదని దావాలో పేర్కొన్నాడు. ఈ కేసును విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. ఆప్ లీడర్లు తమ ప్రతిపక్ష పార్టీపై కామెంట్లు చేశారు. అంతే కానీ ఏ ఒక్కరిపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేయలేదు. రాజకీయ పరువు నష్టం కేసుల్లో సరైన రుజువులు ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు వాక్‌స్వాతంత్రం కిందకు వస్తాయి కాబట్టి పరువు నష్టం కింద చూడలేమని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, గతేడాది ఇదే కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఆతిషికి సమన్లు జారీచేసింది. ఆ తర్వాత రూ.20వేల పూచికత్తుతో బెయిల ్మంజూరు చేసింది.

Next Story