- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pahalgam: పహెల్గాం ఉగ్రదాడి కేసు.. రాజౌరీ ఉగ్రవాదులను ప్రశ్నిస్తున్న ఎన్ఐఏ
పహెల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror attack) కేసుపై విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) వేగవంతం చేసింది. అందులో భాగంగానే ఇటీవలే ప్రత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మాలాలు సేకరించింది.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror attack) కేసుపై విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) వేగవంతం చేసింది. అందులో భాగంగానే ఇటీవలే ప్రత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మాలాలు సేకరించింది. దాడి జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఉన్న పర్యాటకులను, స్థానికులను ప్రశ్నిస్తున్నారు. అక్కడ వారు తీసుకున్న ఫొటోలు, వీడియోల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఇప్పుడు 2023 రాజౌరీలో ఉగ్రదాడికి పాల్పడిన ఇద్దరు ముష్కరులను ప్రశ్నిస్తుంది. జమ్ము జైలులో నిందితులను ఎన్ఐఏ ప్రశ్నిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ముష్కరుల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, పహెల్గాం ఉగ్రవాదులకు, వీరికి సంబంధాలు ఉంటాయనే కోణంలోనూ దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. 2023 జనవరిలో రాజౌరీలోని ధోంగ్రీ గ్రామంపై ఇద్దరు ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఈ దాడి సమయంలో అక్కడ ఉన్న ఓ ఇంటిలో ఐఈడీని దుండగులు అమర్చారు. ఆ తర్వాత అది పేలి మరో ఇద్దరు చనిపోయారు. దీంతో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన నిస్సార్ అహ్మద్, ముస్తాక్ హుస్సేన్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిలో నిస్సార్ మాత్రం లష్కరే హ్యాండ్లర్ అబూ ఖతాల్ అలియాస్ ఖతాల్ సంధితో టచ్‌లో ఉంటూ.. ఇన్ఫార్మర్‌గా పనిచేసేవాడు.
ప్రజా భద్రతా చట్టం కింద..
కాగా.. నిఘా భద్రతా సంస్థ వర్గాల సమాచారం ప్రకారం, జమ్ముకశ్మీర్ పోలీసులు ప్రజా భద్రతా చట్టం కింద పలువురిపై చర్యలు తీసుకుంటున్నారు. గత రెండు రోజుల్లో 100 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇంత ఎక్కువ మందిపై చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి. మరోవైపు, ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో దాదాపు 20 మంది సహకరించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. వీరిలో చాలామందిని ఇప్పటికే అరెస్టు చేశారు. మిగిలినవారు నిఘా నీడలో ఉన్నారు. విచారణలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 2,500 మందిని ప్రశ్నించామన్నారు. వీరిలో 186 మంది ఇప్పటికీ దర్యాప్తు బృందాల కస్టడీలో ఉన్నారు.






