దేశాన్ని మావోయిస్టు రహితంగా మారుస్తాం: అమిత్ షా

by Disha Web Desk 7 |
దేశాన్ని మావోయిస్టు రహితంగా మారుస్తాం: అమిత్ షా
X

రాంచీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని మావోయిస్టు రహితంగా మారుస్తామని అన్నారు. 2024 ఎన్నికల కల్లా ఈ లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు. జార్ఖండ్‌లో నిర్వహించిన వికాస్ మహాసంకల్ప్ ర్యాలీలో శనివారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం హేమంత్ సోరెన్‌పై మాటల దాడికి దిగారు. రాష్ట్రంలో సీఎం ఆదివాసీ అయినప్పటికీ, ప్రభుత్వం ఆదివాసీ వ్యతిరేకి అని విమర్శించారు.

సోరెన్ హాయంలో అవినీతి తీవ్రమైందని, మధ్యవర్తులకు ప్రయోజనం చేకూరిందని ఆరోపించారు. ఈ అవినీతి ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే ఎన్నికల్లో విముక్తి ఇవ్వాలని ప్రజలను కోరారు. ఆదివాసీలకు కేంద్రం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దోపిడి చేస్తుందని మండిపడ్డారు. కాగా, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు 2024లో జరగనున్నాయి. గతంలో సోరెన్‌పై వేటు వేస్తారనే ఊహాగానాల నడుమ బీజేపీ అపరేషన్ లోటస్‌కు ప్రయత్నించిందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed